క్రీడాభూమి

ఓపెనర్‌గా రోహిత్ నేడు బంగ్లాదేశ్‌తో వామప్ మ్యాచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 29: ఇటీవల వివిధ సందర్భాల్లో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగే వామప్ మ్యాచ్‌లో మళ్లీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నీకి సిద్ధమయ్యేందుకు భారత్ మొదటి వామప్ మ్యాచ్‌ని న్యూజిలాండ్‌తో ఆడింది. అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యాన్ని కనబరచింది. వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడినప్పటికీ, డక్‌వర్త్ లూయిస్ విధానం ప్రకారం 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, చివరిదైన రెండో వామప్ మ్యాచ్‌లో రోహిత్‌ను ఓపెనర్‌గా దించాలని విరాట్ కోహ్లీ నిర్ణయించాడు. ఐపిఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు నాయకత్వం వహించి, టైటిల్‌ను సాధించిపెట్టిన రోహిత్‌కు ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వాలని, అప్పుడే చాంపియన్స్ ట్రోఫీలో అతను రాణించగలుగుతాడని జట్టు మేనేజ్‌మెంట్ ఆలోచనగా చెప్తున్నారు. నిజానికి తొలుత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గానే రంగ ప్రవేశం చేసినప్పటికీ, 2013 చాంపియన్స్ ట్రోఫీలో, అప్పటి కెప్టెన్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అతనికి ప్రమోషన్ ఇచ్చాడు. టాప్ ఆర్డర్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడడంతో, ఆతర్వాత కాలంలో ఓపెనర్‌గా స్థిరపడ్డాడు. శిఖర్ ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను మొదలు పెడుతున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో అతను ఓపెనర్‌గానే ఆడనున్నాడు. కాగా, జ్వరంతో బాధపడుతున్న యువరాజ్ సింగ్ పూర్తిగా కోలుకున్నాడా లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. దీనితో అతను వామప్ మ్యాచ్ ఆడడం అనుమానంగానే ఉంది. కెప్టెన్ విరాట్ కోహ్లీతోపాటు అజింక్య రహానే, మహేంద్ర సింగ్ ధోనీ తదితరులతో భారత బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ తమ సత్తా నిరూపించుకునే ప్రయత్నం చేయనున్నారు.