క్రీడాభూమి

భారత్‌దే పైచేయి! ‘చాచా చికాగో’ మహమ్మద్ బషీర్ స్పష్టీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 29: కరడుగట్టిన పాకిస్తాన్ క్రికెట్ అభిమాని మహమ్మద్ బషీర్ టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు. ‘చాచా చికాగో’గా అందరికీ సుపరచితుడైన అతను పాక్ క్రికెట్ అభిమాని. ఆ జట్టు ఎక్కడ మ్యాచ్‌లు ఆడినా వెళతాడు. మద్దతు ప్రకటిస్తాడు. అదే సమయంలో అతనికి భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే వల్లమాలిన అభిమానం. ఒక్కోసారి ధోనీ పేరు, అతని బొమ్మలు ఉన్న దుస్తులను ధరించి ప్రత్యక్షమవుతాడు. ధోనీకి కూడా బషీర్ గురించి తెలుసు. అతనిని చాలాసార్లు కలిశాడు కూడా. అటు పాకిస్తాన్‌కు, ఇటు ధోనీకి అభిమానిగా ప్రకటించుకున్న బషీర్ ఈసారి చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌దే పైచేయి అవుతుందని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జోస్యం చెప్పాడు. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జూన్ నాలుగున జరిగే మ్యాచ్ గురించి ప్రస్తావించగా, దానికి గతంలో మాదిరి ప్రాధాన్యం ఉండదని అన్నాడు. పాకిస్తాన్ కంటే టీమిండియా అన్ని విభాగాల్లోనూ ఎంతో ముందంజలో ఉందని, కాబట్టి, భారత్, పాక్ మ్యాచ్‌ని ఒక అద్భుతంగా పేర్కోవడానికి వీల్లేదన్నాడు. చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ రేసులో టీమిండియా అందరి కంటే ముందున్నదని చెప్పాడు.