క్రీడాభూమి

చాంపియన్స్ ట్రోఫీని నిలబెట్టుకోగలరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 30: చాంపియన్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత జట్టుకు టైటిల్‌ను నిలబెట్టుకునే సామర్ధ్యం ఉందని శ్రీలంక జట్టు మాజీ కెప్టెన్ కుమార సంగక్కర మంగళవారం స్పష్టం చేశాడు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ‘నిజమైన పదును’ను కలిగివున్న భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్న మిగిలిన జట్ల కంటే ఎంతో సమతూకంగా ఉందని సంగక్కర పేర్కొన్నాడు. ‘ఈ ఏడాది ఆసియా ఖండం నుంచి నాలుగు జట్లు చాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్నాయి. వీటిలో భారత జట్టు పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంది. 2013లో చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత జట్టుకు ఈ ఏడాది కూడా విజేతగా నిలిచే సామర్ధ్యం ఉంది’ అని ఐసిసి (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) వెబ్‌సైట్‌లో రాసిన కాలమ్‌లో సంగక్కర అభిప్రాయపడ్డాడు. ‘వాస్తవానికి భారత జట్టు పదునైన ఫాస్ట్ బౌలింగ్‌తో ఎంతో సమతూకంగా, పటిష్టవంతంగా ఉంది. వనే్డ క్రికెట్‌లో చక్కగా రాణిస్తున్న స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా భారత జట్టుకు అదనపు బలం. అలాగే ఐపిఎల్‌లో అభిమానులను నిరాశపర్చిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చాంపియన్స్ ట్రోఫీలో మళ్లీ పుంజుకుని విజృంభించడం ఖాయమని నేను గట్టిగా విశ్వస్తున్నా’ అని సంగక్కర పేర్కొన్నాడు.
భారత్‌తో ఆడుతున్నామని
మరిచిపోవాలి
పాక్ బ్యాట్స్‌మన్ హారిస్ సోహైల్
బర్మింగ్ హామ్, మే 30: చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో భాగంగా తమ చిరకాల ప్రత్యర్థి అయిన భారత్‌తో జరగబోయే మ్యాచ్‌కోసం పాకిస్తాన్‌కు అదనంగా ఎలాంటి స్ఫూర్తీ అవసరం లేదు. భారత్‌ను ఢీకొనడమే ఓ పెద్ద స్ఫూర్తి. రెండు జట్ల మధ్య నరాలు తెగే ఉత్కంఠ, మ్యాచ్ చూసే వారిలోనూ అదే పరిస్థితి. అయితే ఆదివారం జరిగే మ్యాచ్‌లో తమ ప్రత్యర్థి భారత్ అనే విషయాన్ని మరిచిపోవలసిన అవసరం ఉందని పాకిస్తానీ బ్యాట్స్‌మన్ హారిస్ సోహైల్ అంటున్నాడు. ఈ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు పాక్ చివరి వామప్ మ్యాచ్‌కి వరుణుడు ఆటంకం కల్పించాడు. ఆస్ట్రేలియాతో సోమవారం జరిగిన ఈ మ్యాచ్ కేవలం పది ఓవర్లు మాత్రమే కొనసాగింది. అప్పటికి ఆస్ట్రేలియా ఒక వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. దీంతో ఇప్పుడు పాక్ దృష్టి అంతా కూడా వచ్చే ఆదివారం ఇదే మైదానంలో భారత్‌తో జరగబోయే తన తొలి మ్యాచ్‌పైనే ఉంది. భారత్-పాక్‌ల మధ్య జరిగే మ్యాచ్‌లు సహజంగానే కాస్త ఎక్కువ ఉద్రేకంగానే ఉంటాయి అనేది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రెండు దేశాల మధ్య శత్రుత్వం విషయాన్ని పాక్ జట్టుపట్టించుకోకుండా ఉండాలని హారిస్ అంటున్నాడు. భారత్‌తో మ్యాచ్ తమకు పెద్ద మ్యాచే కానీ, దాని గురించే ఎక్కువ ఆలోచించకూడదని, అది కూడా ఒక మామూలు మ్యాచ్‌గానే భావిస్తే బాగుంటుందని హారిస్ అన్నాడు.అంతేకాదు వచ్చే ఆదివారం నాటికి ఇంగ్లాండ్ వాతావరణానికి తమ జట్టు అడ్జస్ట్ అవుతుందని కూడా అతను చెప్పాడు.
ఐసిసి టాప్-10 ర్యాంకుల్లో
ఒకే ఒక్కడు
మూడో స్థానాన్ని నిలుపుకొన్న కోహ్లీ
బౌలర్లలో భారత్‌కు దక్కని చోటు
లండన్, మే 30: వన్‌డేలకు సంబంధించి ఐసిసి తాజాగా ప్రకటించిన టాప్ టెన్ ర్యాకింగ్స్‌లో మన దేశంనుంచి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కడికే స్థానం లభించింది. బ్యాట్స్‌మెన్ జాబితాలో కోహ్లీ తన మూడో స్థానాన్ని అలాగే నిలబెట్టుకున్నాడు. కాగా, వ్యక్తిగత ర్యాంకింగ్స్ విషయంలో టాప్-3 స్థానాలకోసం ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ ఉండడాన్ని బట్టి చూస్తే రాబోయే చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థమవుతుంది. తొలి మూడు స్థానాల్లో ఉన్న దక్షిణాఫ్రికాకు చెందిన ఎబి డెవిలియర్స్ (874 ర్యాంకింగ్ పాయింట్లు), ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ (871 పాయింట్లు), కోహ్లీ(852) మధ్య తేడా కేవలం 22 పాయింట్లే ఉండడం గమనార్హం. కాగా, టాప్-20 బ్యాట్స్‌మెన్ జాబితాలో స్థానం దక్కించుకున్న భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ(12), మహేంద్ర సింగ్ ధోనీ(13), శిఖర్ ధావన్ (15) ఉన్నారు. వాస్తవానికి ధావన్ ఒక స్థానం దిగజారాడు. అయితే బౌలర్ల జాబితాలో టాప్-10లో మన దేశంనుంచి ఏ ఒక్కరికి కూడా స్థానం దక్కక పోవడం కాస్త నిరాశ కలిగించే అంశమే. ఈ జాబితాలో దక్షిణాఫ్రికాకు చెందిన కగిసో రబడా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే టాప్-20 జాబితాలో ఎడంచేతివాటం స్పిన్నర్ అక్షర్ పటేల్ న్యూజిలాండ్‌కు చెందిన మాట్ హెన్రీతో కలిసి సంయుక్తంగా 11వ స్థానంలో నిలవగా, అమిత్ మిశ్రా(13వ స్థానం) , రవిచంద్రన్ అశ్విన్ (18వ స్థానం సంయుక్తంగా)లకు కూడా చోటు లభించింది. బౌలర్లలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన రబడా(724 పాయింట్లు), ఇమ్రాన్ తాహిర్ (722), మైకేల్ స్టార్క్(701) మధ్య కేవలం 23 పాయింట్లు తేడా ఉండడం గమనార్హం. ఇక టాప్-5 వన్‌డే జట్లయిన దక్షిణాఫ్రికా(122), ఆస్ట్రేలియా(118), భారత్(117), న్యూజిలాండ్(114), ఇంగ్లాండ్(112) మధ్య పెద్ద అంతరం లేని నేపథ్యంలో త్వరలో జరగబోయే చాంపియన్స్ ట్రోఫీ తర్వాత ర్యాంకింగ్స్ భారీగా మారిపోయేందుకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.