క్రీడాభూమి

చివరి బంతిలో మోరిస్ విన్నింగ్ షాట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేప్‌టౌన్: చివరి బంతి వరకూ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన మొదటి టి-20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై దక్షిణాఫ్రికా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ చివరి క్షణాల్లో అద్భుత బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించి, చివరి బంతిలో దక్షిణాఫ్రికాను విజయపథంలో నడిపించాడు. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్‌ను ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 134 పరుగులు చేసింది. జోస్ బట్లర్ అజేయంగా 32 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆలెక్స్ హాలెస్ 27 పరుగులు సాధించాడు. ఇమ్రాన్ తాహిర్ చక్కటి బౌలింగ్ ప్రతిభ కనబరచి 21 పరుగులకే నాలుగు వికెట్లు కూల్చాడు. కేల్ బోట్‌కు రెండు వికెట్లు లభించాయి. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికాకు హషీం ఆమ్లా (22), ఫఫ్ డు ప్లెసిస్ (25), జీన్ పాల్ డుమినీ (23) కొంత వరకు అండగా నిలిచారు. అయితే, సాధించాల్సిన రన్‌రేట్ పెరుగుతూ రావడంతో చివరి ఓవర్‌లో 15 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో దక్షిణాఫ్రికా విజయం అనుమానాస్పదంగా మారింది. అయితే, క్రిస్ మోరిస్ (7 బంతుల్లో 17 పరుగులు) చివరి బంతిని విన్నింగ్ షాట్‌గా మార్చి, దక్షిణాఫ్రికాకు మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 8 వికెట్లకు 134 (అలెక్స్ హాలెస్ 27, జోస్ బట్లర్ 32 నాటౌట్, ఇమ్రాన్ తాహిర్ 4/21).
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 7 వికెట్లకు 135 (హషీం ఆమ్లా 22, ఫఫ్ డు ప్లెసిస్ 25, జీన్ పాల్ డుమినీ 23, క్రిస్ మోరిస్ 17 నాటౌట్, జోర్డాన్ 3/23).