క్రీడాభూమి

భువీ మెరుపులు.. దినేష్ పిడుగులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 30: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న భారత జట్టు మరోసారి తన సత్తా చాటుకుంది. ఈ టోర్నీకి సన్నాహకంగా ఇంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో విజయం సాధించిన భారత జట్టు తాజాగా మంగళవారం 240 పరుగుల తేడాతో పసికూన బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టులో వికెట్‌కీపర్ దినేష్ కార్తీక్ (77 బంతుల్లో 94 పరుగులు), హార్దిక్ పాండ్యా (54 బంతుల్లో అజేయంగా 80 పరుగులు) విజృంభించి ఆడగా, నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ (67 బంతుల్లో 60 పరుగులు) కూడా అర్ధ శతకంతో రాణించాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 324 పరుగుల భారీ స్కోరు సాధించగా, అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టును భారత బౌలర్లు గడగడలాడించారు. దీంతో ఆ జట్టు 23.5 ఓవర్లలో 84 పరుగులకే ఆలౌటవడంతో భారత జట్టు అన్ని సన్నాహక మ్యాచ్‌లలోనూ విజయం సాధించినట్లయింది.
అంతకుముందు టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టులో ఓపెనర్ రోహిత్ శర్మ (3 బంతుల్లో 1 పరుగు), ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ అజింక్యా రహానే (21 బంతుల్లో 11 పరుగులు) విఫలమైనప్పటికీ నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్, సెకెండ్ డౌన్ బ్యాట్స్‌మన్ దినేష్ కార్తీక్ బంగ్లాదేశ్ బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించారు. చూడముచ్చటైన షాట్లతో అలరించిన వీరు మూడో వికెట్‌కు 100 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అనంతరం ధావన్ 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరగ్గా, అతని స్థానంలో వచ్చిన కేదార్ జాదవ్ 31 పరుగులు సాధించి నిష్క్రమించాడు. కొద్దిసేపటికి దినేష్ కార్తీక్ (94) స్వచ్ఛందంగా రిటైర్ అయ్యాడు. ఈ తరుణంలో హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించి బంగ్లాదేశ్ బౌలర్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. రవీంద్ర జడేజా (36 బంతుల్లో 31 పరుగులు)తో కలసి ఆరో వికెట్‌కు 86 పరుగులు, రవిచంద్రన్ అశ్విన్‌తో కలసి ఏడో వికెట్‌కు మరో 21 పరుగులు జోడించిన హార్దిక్ పాండ్యా 54 బంతుల్లో 80 పరుగులతో అజేయంగా నిలువగా, భువనేశ్వర్ కుమార్ 1 పరుగుతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 324 పరుగుల భారీ స్కోరు సాధించింది.
అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్‌పై భారత బౌలర్లు ఆరంభం నుంచే నిప్పులు చెరిగారు. ప్రత్యేకించి పేసర్లు భువనేశ్వర్ కుమార్ (13 పరుగులకు 3 వికెట్లు), ఉమేష్ యాదవ్ (16 పరుగులకు 3 వికెట్లు) పదునై బంతులతో ప్రత్యర్థుల భరతం పట్టారు. వీరి జోరును ప్రతిఘటించడంలో ఘోరంగా విఫలమైన బంగ్లాదేశ్ జట్టులో వికెట్‌కీపర్ ముష్ఫికర్ రహీమ్ (18 బంతుల్లో 13 పరుగులు), మెహెదీ హసన్ మిరాజ్ (34 బంతుల్లో 24 పరుగులు), సంజముల్ ఇస్లామ్ (37 బంతుల్లో 18 పరుగులు) మినహా ఎవరూ రెండంకెల స్కోర్లు సాధించలేకపోయారు. దీంతో 23.5 ఓవర్లలో 84 పరుగులకే ఆలౌటైన బంగ్లాదేశ్ జట్టుకు 240 తేడాతో ఘోర పరాజయం తప్పలేదు.

సంక్షిప్తంగా స్కోర్లు

భారత్ ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 324/7 (దినేష్ కార్తీక్ 94, హార్దిక్ పాండ్యా 80-నాటౌట్, శిఖర్ ధావన్ 60, రవీంద్ర జడేజా 32, కేదార్ జాదవ్ 31, అజింక్యా రహానే 11). వికెట్ల పతనం: 1-3, 2-21, 3-121, 4-196, 5-208, 6-294, 7-315. బౌలింగ్: రుబెల్ హసన్ 3/50, సంజముల్ ఇస్లామ్ 2/74, ముస్త్ఫాజుర్ రహ్మాన్ 1/53, తస్కిన్ అహ్మద్ 0/45, సౌమ్య సర్కార్ 0/10, మెహెదీ హసన్ మిరాజ్ 0/39, మొసద్దెక్ హుస్సేన్ 0/29, షకీబ్ అల్ హసన్ 0/23.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: 23.5 ఓవర్లలో 84 ఆలౌట్ (మెహెదీ హసన్ మిరాజ్ 24, సంజముల్ ఇస్లామ్ 18, ముష్ఫికర్ రహీమ్ 13, ఇమ్రుల్ కరుూస్ 7, షకీబ్ అల్ హసన్ 7, సౌమ్య సర్కార్ 2, తస్కిన్ అహ్మద్ 1-నాటౌట్).
వికెట్ల పతనం:1-11, 2-11, 3-11, 4-21, 5-21, 6-22, 7-47, 8-77, 9-83, 10-84. బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 3/13, ఉమేష్ యాదవ్ 3/16, హార్దిక్ పాండ్యా 1/2, మొహమ్మద్ షమీ 1/17, జస్‌ప్రీత్ బుమ్రా 1/32.