క్రీడాభూమి

సై అంటే సై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 31: చాంపియన్స్ ట్రోఫీ వనే్డ క్రికెట్ టోర్నమెంట్‌లో ఇప్పటి వరకూ బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది. దీనితో, కొద్దిమందిని మినహాయిస్తే, చాలా మంది బౌలర్లు నానా ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. గురువారం నుంచి మొదలయ్యే ఎనిమిదో చాంపియన్స్ ట్రోఫీ కూడా బౌలర్లకు పరీక్షగా మారడం ఖాయంగా కనిపిస్తున్నది. అయితే, గతంలో కొంత మంది బౌలర్లు తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారు. సై అంటే సై అంటూ సవాళ్లు విసురుతున్నారు. బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో, వికెట్లు సాధించడంలో ప్రతిభను చాటకుంటున్నారు. ఈసారి గొప్పగా రాణించే అలాంటి ఐదుగురు బౌలర్లను ఎంపిక చేస్తే, వారిలో భారత మీడియం జస్‌ప్రీత్ బుమ్రా పేరు కూడా కనిపిస్తుంది. పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు లేదా టోర్నీల్లో చివరి ఓవర్లు బౌల్ చేయడం ఇటీవల కాలంలో ఒక సవాలుగా మారింది. ఇలాంటి ‘డెత్ ఓవర్లు’ వేయడంలో సమర్థుడిగా బుమ్రా పేరు సంపాదించాడు. యార్కర్లు, ఇన్ లేదా అవుట్ స్వింగర్లతో బ్యాట్స్‌మెన్‌ను తికమకపెట్టడం, పరుగులు చేయకుండా వారిని నియంత్రించడం బుమ్రాకు తెలిసినంతగా మరెవరికీ తెలియదనడం అతిశయోక్తి కాదు. బ్యాట్స్‌మెన్ భారీగా పరుగులు రాబడుతున్నప్పుడు, వారి దూకుడుకు కళ్లెం వేయడానికి కూడా బుమ్రా ఒక గొప్ప అస్త్రంగా ఉపయోగపడుతున్నాడు. వైవిధ్యమైన బంతులతో బ్యాట్స్‌మెన్‌కు కెళ్లెం వేస్తున్నాడు. ఇటీవల ముగిసిన పదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ముంబయి ఇండియన్స్ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ వాతావరణం, అక్కడి పిచ్‌ల తీరును బాగా ఉపయోగించుకునే బౌలర్లలో బుమ్రా ఒకడు. అందుకే, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అతని సేవలపై ఎక్కువగా ఆధారపడడం ఖాయం.
ఫామ్‌లో వోక్స్
ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ వోక్స్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. సుమారు ఏడాది కాలంగా అతను ఇంగ్లాండ్ టెస్టు, వనే్డ జట్లలో ప్రధాన బౌలర్‌గా రాణిస్తున్నాడు. ఇంగ్లాండ్ బౌలింగ్‌లో అతనే కీలకం. పదో ఐపిఎల్‌లో రెండు కోట్ల బేస్ ప్రైస్‌తో వేలానికి వచ్చిన వోక్స్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రెట్టింపు కన్నా ఎక్కువగా 4.2 కోట్ల రూపాయలకు కొన్నదంటే అతని సామర్థ్యంపై ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. చాంపియన్స్ ట్రోఫీ స్వదేశంలో జరుగుతున్నది కాబట్టి, ‘హోం అడ్వాంటేజ్’ని వోక్స్ సంపూర్ణంగా వినియోగించుకోవడం ఖాయం. ఫాస్ట్ బౌలర్‌గానే కాకుండా, హార్డ్ హిట్టర్‌గానూ వోక్స్ పేరు సంపాదించాడు. ఇంగ్లాండ్ తరఫున ఇంత వరకూ 62 వనే్డలు ఆడిన అతను సగటున 5.59 పరుగులిచ్చి 89 వికెట్లు సాధించాడు. బ్యాటింగ్‌లోనూ మెరిపించి, 800 పరుగులు చేశాడు. 95 (నాటౌట్) వనే్డల్లో అతని అత్యధిక స్కోరు.
భయపెడుతున్న స్టార్క్
వివిధ దేశాలకు చెందిన ఫాస్ట్ బౌలర్లలో ప్రస్తుతం అందరి కంటే మెరుగైన స్థానాన్ని ఆక్రమించిన ఆస్ట్రేలియా సూపర్ స్టార్ మిచెల్ స్టార్క్ సహజంగానే బ్యాట్స్‌మెన్‌ను భయపెడుతున్నాడు. గత రెండేళ్లుగా అతను అసాధారణ ప్రతిభాపాటవాలు కనబరుస్తున్నాడు. అతని బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి భయపడని బ్యాట్స్‌మన్ లేడనే చెప్పాలి. 27 ఏళ్ల స్టార్క్ ఇంత వరకూ 65 వనే్డలు ఆడి, 129 వికెట్లు సాధించాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను ఢీకొనే ప్రతి జట్టులోని ఓపెనర్లు అతని బౌలింగ్‌ను ఆచితూచి ఆడాలి. లేకపోతే, భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆసీస్ కెప్టెన్‌కు స్టార్క్ ఒక గొప్ప ఆయుధం. జట్టును ఒంటి చేత్తో గెలిపించే సత్తా అతనికి ఉంది.
గుగ్లీ హీరో తాహిర్
దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌ను గుగ్లీ హీరోగా అభివర్ణించాలి. పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లో ప్రతిభావంతుడైన బౌలర్‌గా అతను గుర్తింపు సంపాదించాడు. వనే్డ, టి-20 ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. ఇటీవల ముగిసిన ఐపిఎల్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన రైజింగ్ పుణే సూపర్‌జెయింట్‌ను టైటిల్ పోరు వరకూ తీసుకెళ్లిన ఘనత అతనికి కూడా దక్కుతుంది. అతని బౌలింగ్‌ను, ప్రత్యేకించి అతను సంధించే గుగ్లీను ఎదుర్కోవడం ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌కు కూడా ఇబ్బందే. పిచ్ స్వభావం ఎలావున్నా బంతిని అద్భుతంగా స్పిన్ చేయగలడు కాబట్టే అతను ఇంత వరకూ ఆడిన 75 వనే్డల్లో 127 వికెట్లు సాధించగలిగాడు. 38 ఏళ్ల వయసులోనూ యువకులతో పోటీపడుతున్న అతను చాంపియన్స్ ట్రోఫీపై తనదైన ముద్ర వేస్తాడని విశే్లషకుల అంచనా.
అమీర్ రెండో ఇన్నింగ్స్!
టీనేజ్ వయసులోనే అసాధారణ ఫాస్ట్ బౌలర్‌గా గుర్తింపు పొందినప్పటికీ, ఆతర్వాత ఫిక్సింగ్ కేసులో ఇరుక్కొని ఐదేళ్లు సస్పెన్షన్‌ను ఎదుర్కొన్న పాకిస్తాన్ పేసర్ మహమ్మద్ అమీర్ మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. కెరీర్‌లో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన అతను రోజురోజుకూ రాటుదేలుతున్నాడు. మెరుపువేగంతో బంతులు వేస్తూ, స్వింగ్ బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తిస్తున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు పడగొట్టి, ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీసే సత్తావున్న అమీర్ చాంపియన్స్ ట్రోఫీలో తన ఉనికిని చాటుకోవడం ఖాయం. ఒక రకంగా చెప్పాలంటే, బౌలింగ్‌లో కేవలం అమీర్ ప్రతిభపైనే భారం వేసి పాక్ బరిలోకి దిగుతున్నది.
chitram...
భరత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా