క్రీడాభూమి

ఆసీస్, బంగ్లా మ్యాచ్‌కి వర్షం బెడద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెన్నింగ్టన్ ఓవల్ (లండన్), జూన్ 5: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సోమవారం బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆరంభమైన మ్యాచ్‌ని వర్షం వెంటాడుతున్నది. 183 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన ఆస్ట్రేలియా 16 ఓవర్లలో ఆరోన్ ఫించ్ (19) వికెట్ కోల్పోయ 83 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 40, కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 22 పరుగులతో అప్పటికి నాటౌట్‌గా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియా విజయం ఖాయంగా కనిపిస్తున్నది. ఏదైనా అనూహ్యమైన సంఘటన జరిగినా, లేక వర్షం మరింత తీవ్రతరమై ఆటను నిలిపేసినా ఫలితం మారచమ్చుగానీ, అలాంటి పరిస్థితి లేదనే చెప్పాలి.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ గౌరవ ప్రదమైన స్కోరు చేయడంలో దారుణంగా విఫలమైంది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 114 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 95 పరుగులు చేసి, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో జొస్ హాజెల్‌వుడ్ క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. ఐదు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్న అతనితోపాటు షకీబ్ అల్ హసన్ (29), మెహెదీ హసన్ మీర్జా (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్స్‌కు పరిమితం కావడంతో బంగ్లాదేశ్ 50 ఓవర్ల కోటాను కూడా పూర్తిగా ఆడలేక. 44.3 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌటైంది. స్టార్క్ 8.3 ఓవర్లు బౌల్ చేసి, 29 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టి, బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను దారుణంగా దెబ్బతీశాడు. ఆడం జంపా రెండు వికెట్లు కూల్చగా, హాజెల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మోజెస్ హెన్రిక్స్, పాట్ కమిన్స్ తలా ఒక్కో వికెట్ చొప్పున తమ ఖాతాలో వేసుకున్నారు.

నాలుగు వికెట్ల స్టార్క్