క్రీడాభూమి

హాకీ ఇండియా లీగ్ ఫైనల్‌లో పంజాబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) మొదటి సెమీ ఫైనల్‌లో జెపీ పంజాబ్ వారియల్స్ జట్టు 3-1 తేడాతో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌ను ఓడించి ఫైనల్ చేరింది. మ్యాచ్ ఆరో నిమిషంలోనే ఢిల్లీకి రూపీందర్ పాల్ సింగ్ గోల్‌ను సాధించిపెట్టాడు. అయితే, ఆ ఆధిక్యాన్ని ఢిల్లీ నిలబెట్టుకోలేకపోయింది. 19వ నిమిషంలో అర్మాన్ ఖురేషీ ద్వారా పంజాబ్ ఈక్వెలైజర్‌ను సాధించింది. అనంతరం ఇరు జట్లు రక్షణాత్మక విధానాన్ని అనుసరించాయి. అయితే, చివరి క్షణాల్లో దాడికి ఉపక్రమించిన పంజాబ్‌కు సైమన్ ఆర్చార్డ్ ద్వారా కీలక గోల్ లభించింది. ఇది ఫీల్డ్‌గోల్ కావడంతో పంజాబ్ రెండు గోల్స్ ఆధిక్యంతో ఢిల్లీని ఓడించి ఫైనల్ చేరింది. టైటిల్ పోరులో కళింగ లాన్సర్ జట్టును పంజాబ్ వేవ్‌రైడర్స్ ఎదుర్కొంటుంది.
రాంచీకి షాక్
గ్రూప్ దశలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించిన రాంచీ రేస్‌కు సెమీ ఫైనల్‌లో అనూహ్య పరాజయం ఎదురైంది. కళింగ లాన్సర్‌ను ఢీకొన్న ఈ జట్టు మ్యాచ్‌ని 2-2గా డ్రా చేసుకుంది. కళింగ తరఫున 22వ నిమిషంలో గుర్జీందర్ సింగ్, 58వ నిమిషంలో మోరిజ్ పర్‌స్టే గోల్స్ సాధించగా, రాంచీకి ట్రెంట్ మిటన్, తిమోతీ డెవిన్ ద్వారా గోల్స్ లభించాయి. ఇరు జట్లు సమవుజ్జీగా నిలవడంతో మ్యాచ్ ఫలితాన్ని తేల్చేదంకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఇందులో కళింగ నాలుగు గోల్స్ సాధించగా, రాంచీ రెండు గోల్స్‌కు పరిమితమై నిష్క్రమించింది. కళింగ తరఫున మో రిజ్ పర్‌స్టే, క్విరిజిన్ కాస్పర్, లలిత్ ఉపాధ్యాయ, అరాన్ జలెవ్‌స్కీ సఫలమయ్యారు. రాంచీ ఆటగాళ్లు ఆష్లే జాక్సన్, బారీ మిడిల్‌టన్ షూటౌట్‌ను సమర్థంగా పూర్తి చేయగా, సర్వన్‌జిత్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్ విఫలమయ్యారు.