క్రీడాభూమి

క్వార్టర్స్ చేరిన హాలెప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జూన్ 5: ప్రపంచ మూడో ర్యాంక్ క్రీడాకారిణి సిమోనా హాలెప్ ఇక్కడ జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్ చేరింది. నాలుగో రౌండ్‌లో ఆమె 21వ ర్యాంకర్ కార్లా సౌరెజ్ నవరోను 6-1, 6-1 తేడాతో వరుస సెట్లలో చిత్తుచేసింది. హాలెప్ విజృంభణకు నవరో నుంచి ఏ దశలోనూ పోటీ లేకుండా పోయింది. మరో మ్యాచ్‌లో పెట్రా మార్టిక్‌ను 4-6, 6-3, 7-5 తేడాతో ఓడించిన ఐదో సీడ్ ఎలినా స్విటోలినా కూడా క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది.
మ్లాడెనోవిచ్ సంచలనం
పారిస్: ఫ్రాన్స్ క్రీడాకారిణి క్రిస్టినా మ్లాడెనోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో సంచలనం సృష్టించింది. నిరుటి విజేత, నాలుగో సీడ్ గార్బెనె ముగురుజాను ఆమె 6-1, 3-6, 6-3 ఆధిక్యంతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్ చేరింది. ఈ ఏడాది మొదటి గ్రాండ్ శ్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్‌ను కైవసం చేసుకున్న స్టార్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ బరిలోకి దిగలేదు. నంబర్ వన్ ఏంజెలిక్ కెర్బర్ అనూహ్యంగా తొలి రౌండ్స్‌కే పరిమితమైంది. దీనితో ముగురుజా టైటిల్ నిలబెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంతా ఊహించారు. కానీ, ఆ అంచనాలను తారుమారు చేస్తూ మ్లాడెనోవిచ్ నాలుగో రౌండ్‌లో ముగురుజాను ఓడించి క్వ్టార్స్‌లోకి అడుగుపెట్టింది. కాగా, మరో టైటిల్ ఫేవరిట్ వీనస్ విలియమ్స్ కూడా ఇంటిదారి పట్టింది. తిమియా బాస్కిన్‌స్కీ 5-7, 6-2, 6-1 స్కోరుతో వీనస్‌ను ఓడించి క్వార్టర్స్ చేరింది.

సిమోనా హాలెప్