క్రీడాభూమి

భారత్, పాక్ మ్యాచ్‌లో రికార్డుల మోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడ్జిబాస్టన్, జూన్ 5: పాకిస్తాన్, భారత్ జట్ల మధ్య ఆదివారం జరిగిన చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. ఈ టోర్నమెంట్‌లోనేగాక, వనే్డ ఇంటర్నేషనల్స్‌లోనే పాకిస్తాన్‌పై భారత్‌కు ఇది రెండో భారీ విజయం. 2008 జూన్ 10న ఢాకాలో జరిగిన మ్యాచ్‌లో 140 పరుగుల తేడాతో గెలిచిన భారత్, తాజా మ్యాచ్‌లో 124 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. కాగా, చాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకూ భారత్‌కు ఇదే భారీ విజయం. 2004 సెప్టెంబర్ 11న సౌతాంప్టన్‌లో కెన్యాపై 98 పరుగులతో గెలవగా, ఇప్పుడు కొత్త రికార్డు నమోదైంది. టీమిండియా ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లకు 319 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈసారి ఇప్పటి వరకూ ఇదే అత్యధిక స్కోరు. ఈనెల ఒకటిన ది ఓవల్ మైదానంలో బంగ్లాదేశ్‌పై ఇంగ్లాండ్ రెండు వికెట్లకు చేసిన 308 పరుగుల స్కోరు రెండో స్థానానికి పడిపోయింది. కాగా, పాకిస్తాన్‌పై మరే ఇతర జట్టు చాంపియన్స్ ట్రోఫీలో ఇంత భారీ స్కోరు చేయలేకపోవడం గమనార్హం.
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఇంగ్లాండ్‌లో అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకూ అతను ఇంగ్లాండ్‌లో ఆడిన 10 వనే్డ ఇన్నింగ్స్‌లో 586 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. చాంపియన్స్ ట్రోఫీలో కనీసం 400 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాను తీసుకుంటే, రన్‌రేట్‌లో ధావన్ నంబర్ వన్‌గా నిలుస్తాడు. ఈ టోర్నీలో అతను ఇంత వరకూ ఆరు ఇన్నింగ్స్ ఆడి 431 పరుగులు చేశాడు. రోహిత్ శర్మతో కలిసి మొదటి వికెట్‌కు 136 పరుగులు జోడించాడు. చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌పై టీమిండియాకు ఇదే అత్యధిక పార్ట్‌నర్‌షిప్. 2004 సెప్టెంబర్ 19న బర్మింహామ్‌లో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్, అజిత్ అగార్కర్ ఏడో వికెట్‌కు 82 పరుగులు జత కలిపితే, ధావన్, రోహిత్ జోడీ ఆ స్కోరును అధిగమించింది. అంతేగాక, ప్రస్తుత చాంపియన్స్ ట్రోఫీలో మొదటి వికెట్‌కు ఇదే తొలి సెంచరీ భాగస్వామ్యం. వీరిద్దరూ ఆరు ఇన్నింగ్స్‌లో 518 పరుగులు జోడించి, ఉత్తమ ఓపెనింగ్ పెయిర్‌గా పేరు సంపాదించారు. చాంపియన్స్ ట్రోఫీలో మూడు పర్యాయాలు సెంచరీ భాగస్వామ్యాలను అందించిన తొలి జోడీగా కూడా వీరి పేరు రికార్డు పుస్తకాల్లో చేరింది. 91 పరుగులతో రోహిత్ శర్మ పాకిస్తాన్‌పై తన అత్యధిక స్కోరును సాధించాడు. అంతేగాక ఇంగ్లాండ్‌లో అతను ఆడిన వనే్డల్లో అతనికి ఇదే భారీ స్కోరు. మొత్తం మీద ఇంగ్లాండ్‌లో రోహిత్ నాలుగు అర్ధ శతకాలు సాధించాడు. వనే్డల్లో అతని హాఫ్ సెంచరీలు 30కి చేరాయి. ఓపెనర్లు ధావన్, రోహిత్‌తోపాటు విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ కూడా అర్ధ శతకాలు పూర్తి చేయడం విశేషం. చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఒక జట్టులోని నలుగురు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీలతో రాణించడం ఇదే మొదటిసారి. భారత కెప్టెన్ కోహ్లీ 81 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, పాకిస్తాన్‌పై పరుగుల సగటును పెంచుకున్నాడు. పాక్‌పై అతను మొత్తం 11 ఇన్నింగ్స్‌లో, 50.44 సగటుతో 454 పరుగులు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీలో అతనికి ఇదే అత్యధిక స్కోరు. ఎనిమిది ఇన్నింగ్స్‌లో మూడో అర్ధ శతకం. ఉమేష్ యాదవ్ 30 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చాడు. పాకిస్తాన్‌పై అతనికి ఇదే అత్యుత్తమ బౌలింగ్ విశే్లషణ. అదే విధంగా చాంపియన్స్ ట్రోఫీలోనూ ఇదే అతని ఉత్తమ బౌలింగ్.

ఉమేష్ యాదవ్