క్రీడాభూమి

కోహ్లీ ‘చారిటీ డిన్నర్’లో మాల్యా ప్రత్యక్షం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 6: వివాదాస్పద మద్యం వ్యాపారవేత్త, పార్లమెంట్ మాజీ సభ్యుడు విజయ్ మాల్యా సోమవారం ఇంగ్లాండ్‌లో విరాట్ కోహ్లీ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ‘చారిటీ డిన్నర్’లో ప్రత్యక్షమయ్యాడు. అయితే ఈ కార్యక్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా భారత క్రికెట్ జట్టులోని ఇతర సభ్యులంతా మాల్యాకు దూరంగా ఉన్నారు. వాస్తవానికి మాల్యా అక్కడికి చేరుకోగానే అనవసర వివాదంలో చిక్కుకోకుండా చూసుకునేందుకు భారత జట్టు అక్కడి నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించింది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఆశ్రయాన్ని పొందుతున్న మాల్యా ఆదివారం ఎడ్గ్‌బాస్టన్‌లో భారత జట్టుకు, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌కు మధ్య జరిగిన మ్యాచ్‌ను వీక్షించాడు. దేశంలోని బ్యాంకులకు దాదాపు 9 వేల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయిన మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) క్రికెట్ టోర్నమెంట్‌లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) జట్టుకు విజయ్ మాల్యా యజమానిగా వ్యవహరిస్తున్న విషయం విదితమే. అయితే విరాట్ కోహ్లీ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన చారిటీ డిన్నర్‌లో మాల్యా ప్రత్యక్షమవడంతో భారత జట్టు అసౌకర్యానికి గురైందని ఈ ఈవెంట్‌లో పాల్గొన్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) అధికారి ఒకరు తెలిపారు. ‘ఈ కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా కోహ్లీ గానీ ఆయన ఫౌండేషన్ గానీ మాల్యాను ఆహ్వానించలేదు. అయినప్పటికీ ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. బహుశా ఈ కార్యక్రమంలో తన అతిథుల కోసం ఒక టేబుల్‌ను కొనుగోలు చేసిన ఎవరో ఒక వ్యక్తి మాల్యాను ఆహ్వానించి ఉండవచ్చు’ అని ఆ అధికారి మంగళవారం పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత జట్టు మాల్యాను కలవకుండా చాలా దూరాన్ని పాటించిందని, మాల్యా రాకతో భారత జట్టు చాలా అసౌకర్యానికి గురైందని, అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా మాల్యాకు ఎవరూ చెప్పే పరిస్థితి లేకపోవడంతో భారత జట్టే అక్కడి నుంచి త్వరగా వెళ్లిపోయిందని, ఇందుకు మాల్యా రాక కూడా ఒక కారణమని ఆ అధికారి వివరించారు.