క్రీడాభూమి

కోహ్లీ ఒక్కడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 8: ఫోబ్స్ పత్రిక ప్రకటించిన వంద మంది అత్యంత ధనవంతులైన క్రీడాకారుల జాబితాలో భారత్ తరఫున క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాత్రమే చోటు దక్కింది. క్రిస్టియానో రొనాల్డో మొత్తం 93 మిలియన్ డాలర్లతో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు. బాస్కెట్‌బాల్ స్టార్ లెబ్రాన్ జేమ్స్ 86.2 మిలియన్ డాలర్ల సంపాదనతో రెండు, అర్జెంటీనా ఫుట్‌బాల్ గ్రేట్ లియోనెల్ మెస్సీ 80 మిలియన్ల డాలర్లతో మూడు, ప్రఖ్యాత టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెదరర్ 64 మిలియన్ డాలర్లు సంపాదించి నాలుగు స్థానాల్లో ఉన్నారు. కోహ్లీ 22 మిలియన్ డాలర్లతో 89వ స్థానాన్ని సంపాదించాడు. అత్యధిక ఆదాయాన్ని సంపాదిస్తున్న అథ్లెట్ల టాప్-100 జాబితాలో మొత్తం 21 దేశాలకు చెందిన వారు చోటు దక్కించుకున్నారు.

చిత్రం.. విరాట్ కోహ్లీ