క్రీడాభూమి

బొపన్నకు టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జూన్ 8: భారత సీనియర్ ఆటగాడు రోహన్ బొపన్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించాడు. కెనడాకు చెందిన గాబ్రియేల డబ్రోవ్‌స్కీతో కలిసి బరిలోకి దిగిన అతను ఫైనల్‌లో అన్నా లెనా గ్రొయెనెఫెల్డ్ (జర్మనీ), రాబర్ట్ ఫరా (కొలంబియా) జోడీపై 2-6, 6-2, 12-10 తేడాతో విజయం సాధించాడు. గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నీల్లో అతను పురుషుల సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో పలుమార్లు పోటీపడ్డాడు. కానీ, టైటిల్‌ను అందుకోవడం ఇదే మొదటిసారి. ఇంతదుకు ముందు మిక్స్ డబుల్స్ విభాగంలో అతను ఆస్ట్రేలియా ఓపెన్‌లో నాలుగు సార్లు (2013, 2014, 2016, 2017), వింబుల్డన్‌లో ఒకసారి (2013), యుఎస్ ఓపెన్‌లో ఒకసారి (2014) క్వార్టర్ ఫైనల్స్ వరకూ చేరగలిగాడు. ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ మొదలయ్యే వరకూ అతనికి అదే అత్యుత్తమ ప్రదర్శన. ఈసారి ఫైనల్ అడ్డంకిని కూడా అధిగమించి, మొట్టమొదటి గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.