క్రీడాభూమి

రషీద్‌కు ఏడు వికెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ లూసియా, జూన్ 10: వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో అఫ్గానిస్తాన్ బోణీ చేసింది. 213 పరుగుల విజయ లక్ష్యంతో ఇన్నింగ్స్ ఆడిన వెస్టిండీస్ యువ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఏడు వికెట్లు పడగొట్టడంతో 44.4 ఓవర్లలో 149 పరుగులకే కుప్పకూలి, 63 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. సిరీస్‌పై అఫ్గానిస్తాన్ 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఈ జట్టు బ్యాటింగ్ ఎంచుకొని, 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 212 పరుగులు సాధించింది. జావేద్ అహ్మదీ 81 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 102 బంతులు ఎదుర్కొన్న అతని స్కోరులో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. గుల్బదీన్ నరుూబ్ 28 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 41 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. ఆస్లే నర్స్ రెండు వికెట్లు పడగొట్టాడు.
విజయ లక్ష్యం చాలా సాధారణమైనది కావడంతో, సునాయాసంగా ఛేదించవచ్చని ఇన్నింగ్స్ మొదలు పెట్టిన వెస్టిండీస్‌కు చుక్కెదురైంది. మూడు పరుగుల స్కోరువద్ద కీరన్ పావెల్ (2) వికెట్‌ను కోల్పోయింది. ఆతర్వాత ఏ దశలోనూ కోలుకోలేక, ఇంకా 32 బంతులు మిగిలి ఉండగానే, 149 పరుగులకు ఆలౌటైంది. షాయ్ హోప్ 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడంటే, విండీస్ బ్యాటింగ్ పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. అల్జరి జోసెఫ్ 27 పరుగులు చేశాడు. మిగతా వారు ఆ మాత్రం కూడా ఆడలేక చేతులెత్తేశారు. విండీస్ బ్యాటింగ్‌ను దారుణంగా దెబ్బతీసిన రషీద్ ఖాన్ మొత్తం 8.4 ఓవర్లు బౌల్ చేసి, 18 పరుగులకే ఏడు వికెట్లు పడగొట్టాడు. దల్వత్ జర్దాన్ 25 పరుగులిచ్చి రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
సంక్షిప్త స్కోర్లు
అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 6 వికెట్లకు 212 (జావేద్ అహ్మదీ 81, గుల్బదీన్ నరుూబ్ 41 నాటౌట్, ఆస్లే నర్స్ 2/34).
వెస్టిండీస్ ఇన్నింగ్స్: 44.4 ఓవర్లలో 149 నాటౌట్ (షాయ్ హోప్ 35, అల్జరి జోసెఫ్ 27, రషీద్ ఖాన్ 7/18, దల్వత్ జర్దాన్ 2/25).