క్రీడాభూమి

మాల్యకు అవమానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 11: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి మాజీ యజమాని, ఫోర్స్ ఇండియా ఫార్ములా వన్ జట్టు సహ భాగస్వామి విజయ్ మాల్యకు కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో అవమానం ఎదురైంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన చాంపియన్స్ ట్రోఫీ కీలక మ్యాచ్‌ని తిలకించేందుకు మరో వ్యక్తితో కలిసి మాల్య స్టేడియానికి వచ్చినప్పుడు చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. అతను సర్ జాక్ హాబ్స్ గేట్ నుంచి లోనికి వెళుతుండగా, స్టాండ్స్‌లో ఉన్న ఒక అభిమాని మాల్య సమీపానికి వెళ్లి, అతని రాకను సెల్ ఫోన్‌లో వీడియో తీశాడు. అదే సమయంలో మరో అభిమాని ‘ఓ దేఖో.. చోర్ జారహాహై అందర్’ (అక్కడ చూడండి.. దొంగ లోపలికి వెళుతున్నాడు) అంటూ బిగ్గరగా ఆరిచాడు. దీనితో అందరూ అటువైపు చూసి మాల్యను వెక్కిరించారు. ‘దొంగ.. దొంగ’ అని అరుస్తూ, అతని పట్ల తమకు ఉన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. చిన్నబుచ్చుకున్న మాల్య వేగంగా నడుచుకుంటూ ‘హాస్పిటాలిటీ బాక్స్’కు వెళ్లిపోయాడు. ఇటీవల కోహ్లీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ‘చారిటీ డిన్నర్’కు కూడా మాల్య హాజరైనప్పుడు, అక్కడ ఇబ్బంది కరమైన వాతావరణం నెలకొంది. భారత బ్యాంకులకు సుమారు 9,000 కోట్ల రూపాయల మేరకు బకాయిలను ఎగవేసి లండన్ పారిపోయిన అతను గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి యజమాని. ఆ జట్టుకే కోహ్లీ నాయకత్వం వహిస్తున్నాడు. భారత కెప్టెన్‌తో మాల్యకు సన్నిహిత సంబంధాలున్నాయని వార్తలు కూడా వచ్చాయి. దీనితో జాగ్రత్త పడిన కోహ్లీ సాధ్యమైనంత వరకూ మాల్యకు దూరంగా ఉంటూ వచ్చాడు. తీరా తన ఫౌండేషన్ నిధుల సేకరణ కోసం చేపట్టిన డిన్నర్‌కు అతను హాజరుకావడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొన్నాడు. తనకు తెలిసిన ఒక వ్యక్తితో కలిసి ఆ డిన్నర్‌కు హాజరైనట్టు సమాచారం. అతని వద్ద ఉన్న డిన్నర్ టికెట్‌పై, అతిథి హోదాలో మాల్య వచ్చాడని కోహ్లీ ఫౌండేషన్ వివరణ ఇచ్చుకుంది.

చిత్రం.. విజయ్ మాల్య