క్రీడాభూమి

గొప్ప కెప్టెన్‌ని నేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 12: దక్షిణాఫ్రికాను సరైన మార్గంలో నడిపే శక్తిసామర్థ్యాలున్న గొప్ప కెప్టెన్‌గా ఎబి డివిలియర్స్ తనను తాను అభివర్ణించుకున్నాడు. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ చాంపియన్స్ ట్రోఫీ నుంచి తమ జట్టు నిష్క్రమించడం పట్ల విచారం వ్యక్తం చేశాడు. కీలక మ్యాచ్‌లో భారత్‌ను ఢీకొని పరాజయాన్ని ఎదుర్కొన్న దక్షిణాఫ్రికా ఇంటిదారి పట్టింది. మేజర్ టోర్నీల్లో ఈ జట్టు కీలక దశల్లో ఓటమిపాలుకావడం కొన్ని దశాబ్దాలుగా ఆనవాయితీగా మారింది. అదే పరిస్థితి చాంపియన్స్ ట్రోఫీలోనూ పునరావృతమైంది. ఈ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ డివిలియర్స్ కెప్టెన్సీ నుంచి వైదొలగుతాడేమోనన్న అనుమానాలు తలెత్తాయి. అయితే, అలాంటిదేమీ లేదని అతను తేల్చిచెప్పాడు. 2019 ఐసిసి వరల్డ్ కప్‌లో జట్టుకు ట్రోఫీని అందిస్తాననే నమ్మకం తనకు ఉందన్నాడు. తాను గొప్ప నాయకుడినని, తాను కెప్టెన్‌గా కొనసాగితేనే జట్టుకు మంచి ఫలితాలు సాధ్యమని వ్యాఖ్యానించాడు. ఆటగాళ్లంతా సమర్థులేనని, సమష్టిగా పోరాటాలు సాగిస్తున్నారని చెప్పాడు. కీలక మ్యాచ్‌లో ఓటమిపాలుకావడం సహజంగానే తనను బాధించిందని అన్నాడు. అయితే, ఆ ఫలితాన్ని పక్కకుపెట్టి, భవిష్యత్ టోర్నీలపై దృష్టి కేంద్రీకరిస్తామని తెలిపాడు. దక్షిణాఫ్రికా జట్టుకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ధీమా వ్యక్తం చేశాడు.

చిత్రం.. ఎబి డివిలియర్స్