క్రీడాభూమి

భూపతికి ఢిల్లీ ఓపెన్ డబుల్స్ టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఢిల్లీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో మహేష్ భూపతి టైటిల్ సాధించాడు. యుకీ భంబ్రీతో కలిసి బరిలోకి దిగిన అతను ఫైనల్‌లో 6-3, 4-6, 10-5 తేడాతో సకేత్ మైనేని, సనమ్ సింగ్ జోడీని ఓడించాడు. మూడేళ్ల కాలంలో భూపతికి ఇదే తొలి టైటిల్ కావడం విశేషం. కాగా, అందుకు ముందు పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో నెగ్గిన సాకేత్ ఫైనల్‌లో స్థానం సంపాదించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 166వ స్థానంలో ఉన్న అతను సెమీ ఫైనల్‌లో బెల్జియం ఆటగాడు కిమ్మెర్ కోప్‌జన్స్‌ను 6-3, 6-1 తేడాతో ఓడించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సాకేత్ చివరి వరకూ అదే ఆధిపత్యాన్ని కొనసాగించాడు. ఇలావుంటే, మహిళల సింగిల్స్‌లో ఉజ్బెకిస్తాన్ క్రీడాకారిణి సబినా షరిపొవా టైటిల్‌ను అందుకుంది. ఫైనల్‌లో ఆమె నినా స్టొజానొవిచ్‌ను 3-6, 6-2, 6-4 తేడాతో ఓడించింది.