క్రీడాభూమి

ప్రస్తుతానికి కుంబ్లేనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: వెస్టిండీస్ టూర్ ముగిసే వరకూ అనిల్ కుంబ్లేనే కోచ్‌గా కొనసాగుతాడని బిసిసిఐ పాలనాధికారుల బృందం (సిఒఎ) తెలిపింది. అయితే, దీనికి కుంబ్లే అంగీకరించాల్సి ఉందని పేర్కొంది. సోమవారం సిఒఎ చీఫ్ వినోద్ రాయ్, సభ్యులు విక్రం లిమాయే, డయానా ఎడుల్జీ సమావేశమై పలు అంశాలను చర్చించారు. అనంతరం వినోద్ రాయ్ విలేఖరులతో మాట్లాడుతూ కొత్త కోచ్ ఎంపిక బాధ్యత సచిన్ తెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్ సభ్యులుగా ఉన్న క్రికెట్ సలహా మండలి (సిఎసి)కి అప్పకించిన విషయాన్ని గుర్తుచేశాడు. నిరుడు సిఎసినే ఇంటర్వ్యూ చేసి, ఏడాది కాలానికి కుంబ్లేను ఎంపిక చేసిందని తెలిపాడు. కోచ్ పదవికి దరఖాస్తులను బిసిసిఐ ఇప్పటికే ఆహ్వానించిందని, అయితే, ఎంపిక ప్రక్రియ పూర్తి చేయడానికి సిఎసి కొంత గడువు కోరిందని వినోద్ రాయ్ వివరించాడు. అందుకే, ఈనెల 23 నుంచి మొదలయ్యే ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌కు, ఆతర్వాత జూలై 9న జరిగే ఏకైక టి-20 ఇంటర్నేషనల్‌కు కోచ్‌గా కుంబ్లేను కొనసాగించాలని సిఒఎ నిర్ణయించినట్టు చెప్పాడు. అయితే, ఇది తమ అభిప్రాయం మాత్రమేనని, దీనికి కుంబ్లే అంగీకారం తెలపాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో కుంబ్లేకు విభేదాలు తలెత్తాయని వచ్చిన వార్తలను అతను తోసిపుచ్చాడు. తాను వారిద్దరితోనూ మాట్లాడానని, ఎవరూ ఏ విధమైన అసంతృప్తి వ్యక్తం చేయలేదని చెప్పాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, బిసిసిఐలో అవతకవకలు జరిగాయని, అధికారులు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని వచ్చిన ఆరోపణల అంశాన్ని క్రమశిక్షణా కమిటీ దృష్టికి తీసుకెళ్లామని అన్నాడు. దీనిపై తాను ప్రత్యేకంగా మాట్లాడాల్సింది ఏమీ లేదని చెప్పాడు.

చిత్రం.. అనిల్ కుంబ్లే