క్రీడాభూమి

వైరుధ్యాలు సహజమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింగ్‌హామ్, జూన్ 13: మానవ సంబంధాల్లో, ప్రత్యేకించి పరస్పర ఉత్తమ సంబంధాల్లో కొన్ని వైరుధ్యాలు తప్పవని, క్రికెట్‌కూ ఈ సూత్రం వర్తిస్తుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ వ్యాఖ్యానించాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ అనిల్ కుంబ్లే మధ్య సయోధ్య లేదని, ఇద్దరూ పరస్పరం విభేదించుకుంటున్నారని వచ్చిన వార్తలపై వ్యాఖ్యానించడానికి క్లార్క్ నిరాకరించాడు. అసలు ఏం జరిగిందో తనకు తెలియదని, డ్రెస్సింగ్ రూమ్‌లో తాను లేనని అన్నాడు. స్పష్టంగా తెలియని విషయాలపై అభిప్రాయాలను వ్యక్తం చేయడం సమంజసం కాదని స్పష్టం చేశాడు. ఒకవేళ ఆ వార్తల్లో నిజం ఉన్నప్పటికీ, ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నాడు. గొప్పగొప్ప సంబంధాల్లో అభిప్రాయభేదాలు తలెత్తడం చాలా సహజమని అన్నాడు. ఈ పరిస్థితి ఎక్కడైనా ఉంటుందని, క్రికెట్‌లోనూ ఒక్కోసారి ఇలాంటి ఘర్షణలు తప్పవన్నాడు. అభిప్రాయ భేదాలు ఎక్కడైనా ఉంటాయని, వాటిని నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవచ్చనీ చెప్పాడు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ, కుంబ్లేతో తనకు పరిచయం ఉందని, అతను చాలా మంచి వ్యక్తి అని అన్నాడు. కెప్టెన్, కోచ్ మధ్య సంబంధాన్ని అతను తండ్రీబిడ్డల అనుబంధంగా పేర్కొన్నాడు. తల్లిండ్రులు తమతమ పిల్లల పట్ల ఒక్కొక్కరూ ఒక్కో రకంగా వ్యవహరిస్తుంటారని అన్నాడు. ఏ ఇద్దరు పిల్లలు ఒకే విధంగా ఉండరన్నది వాస్తవమని చెప్పాడు.
కెప్టెన్‌ది కీలక పాత్ర
టోర్నీలు లేదా సిరీస్‌లు ఏవైనా కెప్టెన్‌దే కీలక పాత్ర అవుతుందని క్లార్క్ చెప్పాడు. జట్టు జయాపజయాలకు కెప్టెన్‌నే బాధ్యుడ్ని చేస్తారని చెప్పాడు. ఎన్ని వ్యూహాలు, ప్రణాళికలను సిద్ధం చేసుకున్నప్పటికీ, మైదానంలోకి దిగిన తర్వాత, పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత కెప్టెన్‌పైనే ఉంటుందన్నాడు. కోహ్లీని సమర్థుడైన కెప్టెన్‌గా క్లార్క్ అభివర్ణించాడు. అతని నాయకత్వ ప్రతిభ గొప్పదని, చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటాడని చెప్పాడు. ఆస్ట్రేలియాలో క్రికెట్ బోర్డు అధికారులు, క్రికెటర్లకు మధ్య పారితోషికాల విషయంలో విభేదాలు కొనసాగుతున్న విషయాన్ని ప్రస్తావించగా, ఈ విషయంలోనూ తనకు పూర్తి వివరాలు తెలియవని అన్నాడు. ఈ విషయాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని హితవు పలికాడు. చాంపియన్స్ ట్రోఫీ గురించి మాట్లాడుతూ ఆస్ట్రేలియా ఇప్పటికే నిష్క్రమించింది కాబట్టి, ఫైనల్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడే అవకాశం ఉందని జోస్యం చెప్పాడు.

చిత్రం.. మైఖేల్ క్లార్క్