క్రీడాభూమి

ఊరంతా సందడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రొసారియో, జూన్ 13: బార్సిలోనా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ పెళ్లికి అతని స్వస్థలమైన రొసారియో ముస్తాబవుతున్నది. చిన్ననాటి స్నేహితురాలు ఆంటోనెల్లా రొకుజోతో మెస్సీ సుమారు దశాబ్దకాలంగా కాపురం చేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. పెద్దవాడు థియాగో ఐదేళ్లవాడు. రెండో వాడు మాటియో వయసు రెండేళ్లు. ఈనెల 24న 30వ ఏట అడుగుపెట్టబోతున్న మెస్సీ మరో ఆరు రోజుల తర్వాత, 30న ఆంటోనెల్లాను వివాహం చేసుకోనున్నాడు. అర్జెంటీనాలో 3ఈ దశాబ్దపు పెళ్లి2గా నిలిచిపోయేలా ఏర్పాట్లు చేయాలన్నది రొసారియో ప్రజల అభిమతం. అందుకే, కనీవినీ ఎరుగని రీతిలో నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. మరోవైపు మెస్సీ దంపతులు కూడా ఈ ఘనమైన వేడుకకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. స్థానిక మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం బార్సిలోనాలో మెస్సీ సహచరులైన స్టార్ ఆటగాళ్లు లూయిస్ సొరెజ్, నేమార్, సెక్ ఫాబ్రిగాస్, జేవియర్ హెర్నాండెజ్ తదితరులు హాజరవుతారు. మరో ఆటగాడు గెరార్డ్ పెక్‌తోపాటు అతని భార్య, కొలంబియాకు చెందిన ప్రముఖ పాప్‌స్టార్ షకీరా కూడా మెస్సీ వివాహ వేడులకు హాజరుకానుంది. షకీరాతోపాటు ఆటపాటా హంగామా ఉంటుంది. అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వానించాలని మెస్సీ దంపతులు అనుకుంటున్నప్పటికీ, వివాహం జరిగే ప్రాంతానికి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావడం ఖాయంగా కనిపిస్తున్నది. ఈనెలలో మేజర్ టోర్నమెంట్స్ ఏవీ లేకపోవడంతో, సాకర్ ప్రపంచ హేమాహేమీలు కూడా ఈ వేడకకు వస్తారు.