క్రీడాభూమి

ఆత్మవిశ్వాసం పెరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్డ్ఫి, జూన్ 13: చాంపియన్స్ ట్రోఫీలో అత్యంత కీలకంగా మారిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించిన తర్వాత తమలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, ఇంగ్లాండ్‌తో సెమీస్‌కు తాము సిద్ధమని పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫ్‌రాజ్ అహ్మద్ అన్నాడు. ఒకానొద దశలో ఓటమి తప్పదని అనిపించినప్పటికీ, కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును సెమీ ఫైనల్‌కు చేర్చిన సర్ఫ్‌రాజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తీవ్రంగా పోరాడి విజయం సాధించామని, ఈ ఉత్సాహంతోనే ఇంగ్లాండ్‌ను సెమీ ఫైనల్‌లో ఎదుర్కొంటామని అన్నాడు. బౌలర్లు అద్భుతంగా బౌల్ చేయడం వల్లే లంకను తక్కువ స్కోరుకు కట్టడి చేయగలిగినట్టు చెప్పాడు. 36 బంతుల్లోనే 50 పరుగులు చేసిన ఫఖర్ జమాన్ పేరును అతను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అతను అద్భుతంగా ఆడాడని అంటూ, మిడిల్ ఆర్డర్ వైఫల్యం తనను ఆందోళనకు గురి చేస్తున్నదని చెప్పాడు. ఇంగ్లాండ్ చాలా బలమైన జట్టని, కాబట్టి లంకతో జరిగిన మ్యాచ్‌లో దొర్లిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పాడు. ఫైనల్‌లో స్థానం కోసం శక్తివంచన లేకుండా పోరాడతామని అన్నాడు. లంకతో తన ఆట ఎంతో సంతృప్తినిచ్చిందని 79 బంతులు ఎదుర్కొని, 61 పరుగులు సాధించిన సర్ఫ్‌రాజ్ చెప్పాడు. భవిష్యత్తులోనూ ఇదే స్థాయిలో రాణిస్తాననే నమ్మకం తనకు ఉందన్నాడు. మరో ప్రశ్నపై అతను స్పందిస్తూ, భగవంతుడే తమ జట్టును గెలిపించాడని అన్నాడు. నిజానికి ఆ మ్యాచ్‌లో దేవుడే కీలకంగా ఆడి తమను గెలిపించాడని వ్యాఖ్యానించాడు.

చిత్రం.. సర్ఫ్‌రాజ్ అహ్మద్