క్రీడాభూమి

కాబ్ వెబ్‌సైట్ హ్యాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూన్ 13: బెంగాల్ క్రికెట్ సంఘం (కాబ్) వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైంది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ, లాల్ బజార్ పోలీస్ స్టేషన్‌లో కాబ్ అధికారులు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. ఈనెల 9న వెబ్‌సైట్‌ను ఎవరో హ్యాక్ చేశారని, అయితే, అందులోటా డాటా పదిరంగానే ఉందని వారు పేర్కొన్నారు. త్వరలోనే సమస్యను అధిగమించి, వెబ్‌సైట్‌ను పునరుద్ధరిస్తామని తెలిపారు. ఇలావుంటే, కాబ్ వెబ్ సైట్‌ను ఎవరు, ఎందుకు హ్యాక్ చేసి ఉంటారు? దీని వల్ల వారికి ప్రయోజనం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానాలను రాబట్టే ప్రయత్నంలో పడ్డారు పోలీసులు. ప్రపంచంలోనే అత్యదిక ఆదాయ వనరుల్ల క్రికెట్ సంస్థ బిసిసిఐ అధికారులు కూడా అప్రమత్తమైనట్టు సమాచారం. భారత మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ కాబ్‌కు అధ్యక్షుడిగా ఉన్నాడు. సచిన్ తెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్‌తో కలిసి అతను క్రికెట్ సలహా మండలి సభ్యుడిగా కొనసాగుతున్నాడు. కొత్త కోచ్ ఎంపికలో అతని పాత్ర కూడా ఉన్నందున వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి ఉంటారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయ.