క్రీడాభూమి

ఆ రికార్డును భారతీయుడే బద్దలు చేస్తాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్ చరిత్రలో తక్కువ బంతుల్లోనే సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ నెలకొల్పిన రికార్డును భారతీయుడే బద్దలు కొడతాడని మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా జోస్యం చెప్పాడు. గుజరాత్ లయన్స్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అతను మాట్లాడుతూ మెక్‌కలమ్ అద్వితీయ ప్రతిభావంతుడని, అతను రికార్డు నెలకొల్పడంలో వింత ఏమీ లేదని అన్నాడు. అయితే, భారత క్రికెటర్లలోనే ఎవరైనా ఈ రికార్డును అధిగమిస్తారని అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో కొత్తగా అడుగుపెట్టిన గుజరాత్ లయన్స్ జట్టుకు నాయకత్వం వహించడం తన అదృష్టమని అన్నాడు. ఈ హోదాను తనకు అందించినందుకు ఫ్రాంచైజీ యజమాని కేశవ్ బన్సాల్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఎనిమిది సంవత్సరాలు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఒక్క గేమ్ కూడా తప్పకుండా అన్నింటిలోనూ ఆడానని చెప్పాడు. ఇప్పుడు కొత్త జట్టు తరఫున ఆడాల్సి రావడంతో ఉత్కంఠకు గురవుతున్నానని అన్నాడు. టోర్నీలో రాణిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

న్యూఢిల్లీలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో గుజరాత్ లయన్స్ జెర్సీని విడుదల చేస్తున్న
ఫ్రాంచైజీ యజమాని కేశవ్ బన్సాల్ (ఎడమ), కెప్టెన్ సురేష్ రైనా