క్రీడాభూమి

రూపీందర్‌కు గాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 14: భారత స్టార్ డిఫెండర్ రూపీందర్‌పాల్ సింగ్ గురువారం నుంచి మొదలయ్యే హాకీ వరల్డ్ లీగ్ సెమీ ఫైనల్స్ పోటీలకు అందుబాటులో ఉండడం లేదు. కాలి కండరాలు బెణకడంతో అతను బాధపడుతున్నాడని, మ్యాచ్ ఆడే అవకాశం లేదని భారత జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. కాగా, సమర్థుడైన డ్రాగ్ ఫ్లికర్‌గా పేరు తెచ్చుకున్న ఎస్‌కె ఉతప్ప కూడా ఈ పోటీల్లో పాల్గొనడం లేదు. అత్యవసరంగా హాజరుకావాల్సిన పరిస్థితి తలెత్తడంతో అతను లండన్ నుంచి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. కాగా, రూపీందర్ స్థానంలో జస్జిత్ సింగ్ కులార్ జట్టులోకి వస్తాడు. ఇటీవల బెంగళూరులో జరిగిన శిక్షణా శిబిరంలో పాల్గొన్న 30 మంది ప్రాబబుల్స్‌లో అతను కూడా ఒకడు. భారత్ తరఫున ఇంత వరకూ 46 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన అతను ఐదు గోల్స్ సాధించాడు. ఇలావుంటే, ఉతప్ప స్థానంలో సుమీత్‌ను తీసుకుంటున్నారు. ఇటీవలే అజ్లన్ షా హాకీ టోర్నమెంట్‌తో అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించిన అతను నిరుడు జూనియర్స్ జట్టుకు అత్యుత్తమ సేవలు అందించాడు. జూనియర్స్ ప్రపంచ కప్‌ను భారత్ సాధించడంలో కీలక భూమిక పోషించి, సెలక్టర్ల దృష్టిని ఆకట్టుకున్నాడు. ఈ యువ ఆటగాడికి ఉజ్వల భవిష్యత్తు ఉందని అంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
హాకీ వరల్డ్ లీగ్ సెమీ ఫైనల్ టోర్నీలో భారత్ గురువారం మొదటి మ్యాచ్‌ని స్కాట్‌లాండ్‌పై ఆడుతుంది.