క్రీడాభూమి

మెక్‌కలమ్ రికార్డు శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైస్ట్‌చర్చి: న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ కెరీర్‌లో తన చివరి టెస్టును చిరస్మరణీయమైనదిగా మార్చుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి, రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో అతను కేవలం 54 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా శతకాన్ని చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించాడు. 1985-86 సీజన్‌లో భాగంగా సెయింట్ జాన్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో వెస్టిండీస్ సూపర్ స్టార్ వివియన్ రిచర్డ్స్ 56 బంతుల్లోనే సెంచరీ సాధించి నెలకొల్పిన రికార్డును 2014లో ఆస్ట్రేలియాతో అబూదబీలో జరిగిన టెస్టులో పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ ఇంజమాముల్ హక్ సమం చేశాడు. కాగా, వీరిద్దరి కంటే రెండు బంతులు తక్కువ ఆడి శతకాన్ని సాధించిన మెక్‌కలమ్ కొత్త రికార్డును నెలకొల్పాడు. గత ఏడాది ఇదే మైదానంలో శ్రీలంకపై 74 బంతుల్లో సెంచరీ చేసిన మెక్‌కలమ్ ఈసారి ఏకంగా ప్రపంచ రికార్డును సృష్టించాడు.
న్యూజిలాండ్ 370 ఆలౌట్
కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ రికార్డు శతకంతో రాణించడంతో, ఆస్ట్రేలియాతో శనివారం ఇక్కడ ప్రారంభమైన చివరి, రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 370 పరుగులు సాధించగలిగింది. కోరీ ఆండర్సన్ (72), బిజె వాట్లింగ్ (58) సాధించిన అర్థ శతకాలు న్యూజిలాండ్‌కు ఉపయోగపడ్డాయి. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియాన్ 61 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. జొష్ హాజెల్‌వుడ్, జేమ్స్ పాటిన్సన్, జాక్సన్ బర్డ్ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 57 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 12 పరుగులు చేసి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో మార్టిన్ గుప్టిల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆట ముగిసే సమయానికి జో బర్న్స్ 27, ఉస్మాన్ ఖాజా 18 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 65.4 ఓవర్లలో ఆలౌట్ 370 (బ్రెండన్ మెక్‌కలమ్ 145, కోరీ ఆండర్సన్ 72, వాట్లింగ్ 58, నాథన్ లియాన్ 3/61).
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 57 (బర్న్స్ 27 నాటౌట్, ఉస్మాన్ ఖాజా 18 నాటౌట్).

టెస్టు క్రికెట్‌లో
‘టాప్-10’ శతకాలు
టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన ‘టాప్-10’ శతకాల వివరాలు..
1. బ్రెండన్ మెక్‌కలమ్ (న్యూజిలాండ్/ 54 బంతుల్లో సెంచరీ), 2. వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్), ఇంజమాముల్ హక్ (పాకిస్తాన్/ 56 బంతులు), 3. ఆడం గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా/ 57 బంతులు), 4. జాక్ గ్రెగరీ (ఆస్ట్రేలియా/ 67 బంతులు), 5. శివనారైన్ చందర్‌పాల్ (వెస్టిండీస్), డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా/ 69 బంతులు), 6. క్రిస్ గేల్ (వెస్టిండీస్/ 70 బంతులు), 7. రాయ్ ఫ్రెడెరిక్స్ (వెస్టిండీస్/ 71 బంతులు), 8. మాజిద్ ఖాన్ (పాకిస్తాన్), కపిల్ దేవ్ (్భరత్), మహమ్మద్ అజరుద్దీన్ (్భరత్), బ్రెండన్ మెక్‌కలమ్ (న్యూజిలాండ్/ 74 బంతులు), 9. ఎబి డివిలియర్స్ (దక్షిణాఫ్రికా/ 75 బంతులు), 10. గిల్బర్ట్ జెసోప్ (ఇంగ్లాండ్/ 76 బంతులు).

ఇబ్బంది పడ్డాను
క్రైస్ట్‌చర్చి: టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా శతకం నమోదు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పిన న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ ఇబ్బంది పడ్డాడు. వెస్టిండీస్ మాజీ సూపర్ స్టార్ వివియన్ రిచర్డ్స్ రికార్డును అధిగమించడమే అందుకు కారణం. ఈ విషయాన్ని విలేఖరులతో మాట్లాడుతూ మెక్‌కలమ్ చెప్పాడు. రికార్డు సెంచరీ సాధించడం ఆనందంగా ఉన్నప్పటికీ, చిన్నతనం నుంచి తాను ఎంతో అభిమానించిన రిచర్డ్స్ రికార్డును బ్రేక్ చేయాల్సి వచ్చిందన్న ఇబ్బంది కూడా తనను వెంటాడిందని చెప్పాడు. కెరీర్‌లో చివరి టెస్టు ఆడుతున్న తనకు ఒక అపురూపమైన రికార్డు లభించడం సంతృప్తినిచ్చిందని అన్నాడు.
టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత తక్కువగా 54 బంతుల్లోనే సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పిన న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధికంగా 100 సిక్సర్లు కొట్టి, ఆడం గిల్‌క్రిస్ట్‌తో మొదటి స్థానాన్ని పంచుకుంటున్న మెక్‌కలమ్ తన సూపర్ ఇన్నింగ్స్‌లో 21 ఫోర్లు, నాలుగు సిక్సర్లు
కొట్టాడు.
మొదటి సిక్స్‌ను కొట్టిన వెంటనే, 101
సిక్సర్లతో అతను గిల్‌క్రిస్ట్ రికార్డును బద్దలు చేశాడు. ఇప్పుడు అతని ఖాతాలో 104 సిక్సర్లున్నాయి.

మెక్‌కలమ్ 39 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జేమ్స్ పాటిన్సన్ వేసిన బంతి అతని బ్యాట్‌ను తగులుతూ దూసుకెళ్లింది. మిచెల్ మార్ష్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. అయితే, అది నోబాల్ కావడంతో మెక్‌కలమ్‌కు లైఫ్ లభించింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతను సెంచరీతో చెలరేగిపోయాడు. ప్రపంచ రికార్డు సృష్టించాడు. కెరీర్‌లో చివరి టెస్టు అతనికి ఎప్పటికీ గుర్తుండే అరుదైన రికార్డును అందించడం విశేషం.

టెస్టు క్రికెట్ చరిత్రలో 54 బంతుల్లోనే సెంచరీ చేసి కొత్త రికార్డును సృష్టించిన
న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్. కెరీర్‌లో అతనికి ఇదే చివరి టెస్టు