క్రీడాభూమి

ఆడుకున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింగ్‌హామ్, జూన్ 15: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత జట్టు వరుసగా రెండో టైటిల్‌కు చేరువైంది. ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా గురువారం ఇక్కడ జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టును 9 వికెట్ల తేడాతో మట్టికరిపించి మరోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 264 పరుగులు సాధించగా, 40.1 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే నష్టపోయి 265 పరుగులు రాబట్టుకున్న భారత జట్టు లక్ష్యాన్ని అధిగమించింది. క్రీజ్‌లో పాతుకుపోయి బంగ్లాదేశ్ బౌలర్లను ఆటాడుకున్న ఓపెనర్ రోహిత్ శర్మ (123-నాటౌట్), కెప్టెన్ విరాట్ కోహ్లీ (96-నాటౌట్) భారత జట్టుకు సునాయాస విజయాన్ని అందించారు. అంతకుముందు టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టును టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆరంభంలోనే చావుదెబ్బ తీశాడు. తొలి ఓవర్ చివరి బంతికి నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ (0)ను క్లీన్‌బౌల్డ్ చేసిన భువీ ఏడో ఓవర్‌లో సబ్బీర్ రహ్మాన్ (19) వికెట్‌ను కూడా కైవసం చేసుకున్నాడు. దీంతో బంగ్లాదేశ్ 31 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ తరుణంలో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్, వికెట్‌కీపర్ ముష్ఫికర్ రహీమ్ క్రీజ్‌లో నిలదొక్కుకుని ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. భారత బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించిన వీరు చెరో అర్ధ శతకాన్ని నమోదు చేసుకోవడంతో పాటు మూడో వికెట్‌కు 123 పరుగులు జోడించారు. 28వ ఓవర్‌లో తమీమ్ ఇక్బార్ (70) కేదార్ జాదవ్ బౌలింగ్‌లో నిష్క్రమించడంతో వీరి భాగస్వామ్య ముగిసింది. అనంతరం మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 15 పరుగులు సాధించి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో వికెట్ల వెనుక మహేంద్ర సింగ్ ధోనీ చేతికి చిక్కగా, ముష్ఫికర్ రహీమ్ 61 పరుగులు సాధించి జాదవ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి దొరికిపోయాడు. ఆ తర్వాత మొసాదెక్ హుస్సేన్ 15 పరుగులు, మహ్మదుల్లా 21 పరుగులు సాధించి జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో వెనుదిరగ్గా, కెప్టెన్ మషఫ్రీ మోర్తజా (30), తస్కిన్ అహ్మద్ (10) అజేయంగా నిలిచారు. దీంతో బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 264 పరుగులు రాబట్టింది.
అనంతరం 265 పరుగుల లక్ష్యంతో టీమిండియా ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ప్రత్యర్థులను ధాటిగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా శిఖర్ ధావన్ బ్యాట్ ఝళిపించి బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 34 బంతుల్లో 46 పరుగులు సాధించిన ధావన్ 15వ ఓవర్‌లో మషఫ్రీ మోర్తజా వేసిన బంతిని ఎదుర్కోబోయి మొసాదెక్ హుస్సేన్‌కు క్యాచ్ ఇవ్వడంతో 87 పరుగుల స్కోరు వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ తరుణంలో ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్‌గా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా బంగ్లాదేశ్ బౌలర్లపై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. దీంతో స్కోరుబోర్డు పరుగులు తీసింది. కోహ్లీ అందించిన సహకారాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని 111 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ మొత్తం మీద 129 బంతుల్లో 123 పరుగులతో అజేయంగా నిలువగా, కోహ్లీ 96 బంతుల్లో 96 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో 40.1 ఓవర్లలో ఒక వికెట్‌ను మాత్రమే కోల్పోయి 265 పరుగులు సాధించిన భారత జట్టు మరో 59 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అధిగమించి 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన రోహిత్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కైవసం చేసుకున్నాడు.

స్కోరుబోర్డు
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ ఇక్బాల్ (బి) కేదార్ జాదవ్ 70, సౌమ్య సర్కార్ (బి) భువనేశ్వర్ కుమార్ 0, సబ్బీర్ రహ్మాన్ (సి) జడేజా (బి) భువనేశ్వర్ కుమార్ 19, ముష్ఫికర్ రహీమ్ (సి) కోహ్లీ (బి) కేదార్ జాదవ్ 61, షకీబ్ అల్ హసన్ (సి) ధోనీ (బి) జడేజా 15, మహ్మదుల్లా (బి) బుమ్రా 21, మొసాదెక్ హుస్సేన్ (సి అండ్ బి) బుమ్రా 15, మషఫ్రీ మోర్తజా నాటౌట్ 30, తస్కిన్ అహ్మద్ నాటౌట్ 10, ఎక్స్‌ట్రాలు: (లెగ్‌బైస్ 9, వైడ్స్ 7, నోబాల్స్ 2, పెనాల్టీ 5) 23, మొత్తం: 50 ఓవర్లలో 264/7. వికెట్ల పతనం: 1-1, 2-31, 3-154, 4-177, 5-179, 6-218, 7-229. బౌలింగ్: భునేశ్వర్ కుమార్ 10-1-53-2, జస్‌ప్రీత్ బుమ్రా 10-1-39-2, రవిచంద్రన్ అశ్విన్ 10-0-54-0, హార్దిక్ పాండ్య 4-0-34-0, రవీంద్ర జడేజా 10-0-48-1, కేదార్ జాదవ్ 6-0-22-2.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ నాటౌట్ 123, శిఖర్ ధావన్ (సి) మొసాదెక్ హుస్సేన్ (బి) మషఫ్రీ మోర్తజా 46, విరాట్ కోహ్లీ నాటౌట్ 96, ఎక్స్‌ట్రాలు: 0, మొత్తం: 40.1 ఓవర్లలో 265/1.
వికెట్ల పతనం: 1-87. బౌలింగ్: మషఫ్రీ మోర్తజా 8-0-29-1, ముస్త్ఫాజుర్ రహ్మాన్ 6-0-53-0, తస్కిన్ అహ్మద్ 7-0-49-0, రుబెల్ హుస్సేన్ 6-0-46-0, షకీబ్ అల్ హసన్ 9-0-54-0, మొసాదెక్ హుస్సేన్ 2-0-13-0, మహ్మదుల్లా 1-0-10-0, సబ్బీర్ రహ్మాన్ 1.1-0-11-0.

చిత్రం.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రోహిత్ శర్మ (123 నాటౌట్)