క్రీడాభూమి

నేమార్, సౌరెజ్ గోల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్: స్పానిష్ సుకర్ చాంపియన్‌షిప్ లా లిగాలో బార్సిలోనా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. లాస్ పల్మాస్‌తో జరిగిన మ్యాచ్‌ని 2-1 తేడాతో గెల్చుకొని, పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ జట్టు ఖాతాలో మొత్తం 63 పాయింట్లు ఉండగా, రెండో స్థానంలో నిలిచిన అట్లెటికో మాడ్రిడ్ ఏకంగా తొమ్మిది పాయింట్లు వెనుకంజలో ఉంది. రియల్ మాడ్రిడ్ 53 పాయింట్లతో మూడో స్థానాన్ని ఆక్రమించింది. కాగా, పల్మాస్‌తో జరిగిన మ్యాచ్‌లో నేమార్, లూయిస్ సౌరెజ్ గోల్స్ చేసి బార్సిలోనాను గెలిపించారు. మ్యాచ్ ఆరో నిమిషంలోనే సౌరెజ్ చేసిన గోల్‌తో బార్సిలోనా 1-0 ఆధిక్యాన్ని అందుకుంది. అయితే, మరో నాలుగు నిమిషాల్లోనే పల్మాస్‌కు విలియన్ జోస్ డి సిల్వ ఈక్వెలైజర్‌ను అందించాడు. 39వ నిమిషంలో నేమార్ గోల్‌తో 2-1 ఆధిక్యంలోకి వెళ్లిన బార్సిలోనా తన ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా డిఫెన్స్ సూత్రాన్ని అమలు చేసి, అదే తేడాతో విజయం సాధించింది.

మహిళల హాకీలో
భారత్ బోణీ
కేప్ టౌన్, ఫిబ్రవరి 21: దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత మహిళల హాకీ జట్టు బోణీ చేసింది. మొదటి టెస్టును 1-0 తేడాతో గెల్చుకుంది. దీపికా ఠాకూర్ కీలకమైన ఈ గోల్‌ను చేసి, భారత్‌ను గెలిపించింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు రక్షణాత్మకంగా ఆడడంతో గోల్స్ సాధ్యం కాలేదు. రెండు జట్లలోనూ డిఫెన్స్ చాలా బలంగా కనిపించింది. మ్యాచ్ డ్రాగా ముగుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న సమయంలో దీపిక చేసిన గోల్ భారత్‌కు విజయాన్ని అందించింది.