క్రీడాభూమి

ప్రతీకారం తీర్చుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, జూన్ 17: చాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లో భారత్ చేతిలో ఎదురయిన ఘోరపరాజయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి పాక్‌కు ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ ఓ సువర్ణావకాశమని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయ పడ్డాడు. తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఘోరంగా ఓడిపోయినందున ఫైనల్లో మన ప్రతిష్ఠను తిరిగి నిలబెట్టుకోవడానికి ఒక గొప్ప అవకాశం లభించిందని తాను భావిస్తున్నట్లు ‘సమా’ టెలివిజన్‌కిచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ అన్నాడు. ఆ మ్యాచ్‌లో చేసిన తప్పులనుంచి పాకిస్తాన్ గుణపాఠాలు నేర్చుకోవలసిన అవసరం ఉందని కూడా ఆయన అభిప్రాయ పడ్డాడు. 1992లో జరిగిన ప్రపంచ కప్ వన్‌డే టోర్నమెంట్‌లో తన నాయకత్వంలో పాకిస్తాన్‌కు కప్‌ను సాధించిపెట్టిన ఇమ్రాన్ ఖాన్‌ను పాకిస్తానీలు అత్యుత్తమ కెప్టెన్‌గా భావిస్తారు. ఒక వేళ ఫైనల్లో పాకిస్తాన్ గనుక టాస్ గెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోను భారత్‌ను బ్యాట్ చేయవద్దని పాక్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు ఇమ్రాన్ సలహా ఇచ్చాడు కూడా.‘్భరత్ బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. ఒక వేళ టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు పంపితే అది భారీ స్కోరు సాధిస్తుంది. దాంతో పాక్ జట్టుపై ఒత్తిడి పడుతుంది. పాక్ జట్టు బలం బౌలింగే కాబట్టి తొలుత బ్యాటింగ్ చేపడితే ఆ తర్వాత ప్రత్యర్థిని కట్టడి చేసే అవకాశం ఉంటుంది. మన బౌలింగ్‌తో పోలిస్తే బ్యాటింగ్ అంత మెరుగ్గా లేదు’ అని ఇమ్రాన్ అన్నాడు.

చిత్రం.. ఇమ్రాన్ ఖాన్