క్రీడాభూమి

అటు క్రికెట్.. ఇటు హాకీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 17: దాయాది దేశాలయిన భారత్, పాక్‌ల మధ్య ఏ పోటీ జరిగినా రెండు దేశాల్లో అభిమానులకు పండగే. అది జాతీయ క్రీడ అయిన హాకీ కావచ్చు లేదా అత్యధికులు అభిమానించే క్రికెట్ కావచ్చు.. ఇరు దేశాల్లోను అభిమానులు తమ దేశమే విజయం సాధించాలని కోరుకొంటూ ఉంటారు. ఈ క్రీడా శత్రుత్వం ఈ నాటిది కాదు.. శతాబ్దాలుగా ఉన్నదే. మ్యాచ్‌లు ప్రత్యక్షంగా వీక్షించడానికి వచ్చేవారే కాదు, చివరికి టీవీ సెట్ల ముందుండే వారిదీ అదే పోకడ. తమ జట్టు గెలిస్తే చాలు వీధుల్లోకి వచ్చి పండగ చేసేసుకుంటారు. అలాంటిది ఒకటి కాదు రెండు పోటీల్లో ఒకే రోజు ఇరు దేశాలు తలపడుతుంటే అభిమానుల వీరంగానికి పట్టపగ్గాలుండవు. ఇలాంటి అరుదైన ఘటనకు ఆదివారం లండన్ వేదిక కాబోతోంది. చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లో భాగంగా ఆదివారం ఓవల్ స్టేడియంలో ఇరు దేశాల జట్లు తలపడనుండగా, అక్కడికి 55 మైళ్ల దూరంలో నగర శివార్లలోని మిల్టన్ కీన్స్‌లో హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నమెంట్‌లో భాగంగా ఇరు జట్లు తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం క్రికెట్ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుండగా హాకీ మ్యాచ్ సాయంత్రం ఆరున్నర గంటలకు మొదలవుతుంది. ఈ రెండు మ్యాచ్‌లకు కూడా బ్రిటన్‌లో స్థిరపడిన ఇరు దేశాలవారు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. అక్కడే కాదు ఇటు స్వదేశాల్లోను కోట్లాది మంది క్రీడాభిమానులు నరాలు తెగే ఉత్కంఠతో ఈ మ్యాచ్‌లకోసం ఎదురు చూస్తున్నారు.

చిత్రం.. ఫైనల్ మ్యాచ్ జరగనున్న ఓవల్ స్టేడియంలో శనివారం చాంపియన్స్ ట్రోఫీతో
భారత్, పాక్ క్రికెట్ జట్ల కెప్టెన్లు విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ అహ్మద్