క్రీడాభూమి

ఇండోనేషియా ఓపెన్ విజేత శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, జూన్ 18: ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ విజేతగా నిలిచాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 22వ స్థానంలో కొనసాగుతున్న శ్రీకాంత్ ఆదివారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన క్వాలిఫయర్ ఆటగాడు కజుమసా సకాయ్‌ని వరుస గేముల తేడాతో మట్టికరిపించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. సూపర్ సిరీస్ టోర్నీల్లో శ్రీకాంత్‌కు ఇది మూడో టైటిల్. ఏప్రిల్‌లో జరిగిన సింగపూర్ ఓపెన్ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ రన్నరప్ టైటిల్‌తో సరిపెట్టుకున్న శ్రీకాంత్, 2014లో చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను, 2015లో ఇండియా సూపర్ సిరీస్ టైటిల్‌ను కైవసం చేసుకున్న విషయం విదితమే. తాజాగా ఇండోనేషియా సూపర్ సిరీస్ ఫైనల్‌లో మ్యాచ్ ఆరంభం నుంచే విజృంభించి ఆడిన శ్రీకాంత్ తొలి గేమ్‌ను 21-11 తేడాతో సునాయాసంగా గెలుచుకున్నాడు. అయితే రెండో గేమ్ ఆరంభంలో ప్రత్యర్థి నుంచి అతనికి గట్టిపోటీ ఎదురైంది. దీంతో 6-11 తేడాతో వెనుకబడిన శ్రీకాంత్ ఆ తర్వాత మళ్లీ పుంజుకున్నాడు. ఫలితంగా 21-19 తేడాతో ఆ గేమ్‌ను కూడా కైవసం చేసుకున్న శ్రీకాంత్ కేవలం 37 నిమిషాల్లో ప్రత్యర్థిని చిత్తుచేసి టైటిల్‌తో పాటు 75 వేల డాలర్ల చెక్కును అందుకున్నాడు.
అనంతరం శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ, ఈ మ్యాచ్‌లో తన ప్రత్యర్థి సకాయ్ చాలా చక్కగా ఆడాడని ప్రశంసించాడు. ప్రత్యేకించి రెండో గేమ్‌లో అతను గట్టిపోటీ ఇవ్వడంతో 6-11 తేడాతో వెనుకబడిన తాను ఆ తర్వాత పుంజుకుని 13-13తో స్కోరును సమం చేయడం ఈ మ్యాచ్‌ను మలుపుతిప్పిందని చెప్పాడు. ఏది ఏమైనప్పటికీ పెద్ద టోర్నమెంట్‌గా పరిగణించే ఇండోనేషియా ఓపెన్‌లో టైటిల్‌ను సాధించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని, ప్రత్యేకించి ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ముందు ఈ టైటిల్ లభించడం తనకు ఎంతో ఉత్తేజాన్ని ఇస్తోందని అన్నాడు. ఈ విజయం సాధించడంలో తనను వెన్నుతట్టి ప్రోత్సహించిన కోచ్‌తో పాటు అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని శ్రీకాంత్ తెలిపాడు.
ప్రధాని అభినందనలు
ఇదిలావుంటే, ఇండోనేషియా సూపర్ సిరీస్ ప్రీమియర్ బాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలిచిన శ్రీకాంత్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. శ్రీకాంత్ ఈ విజయం సాధించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని మోదీ ట్వీట్ చేశారు. ప్రధానితో పాటు బాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బిఎఐ) అధ్యక్షుడు హిమంత బిశ్వాస్ శర్మ, క్రికెటర్ వీరేంద్ర సెవాగ్, శ్రీకాంత్ సహచరులైన హెచ్‌ఎస్.ప్రణయ్, అజయ్ జయరామ్, మిక్స్‌డ్ డబుల్స్ స్పెషలిస్టు అశ్వనీ పొన్నప్ప కూడా అతనికి అభినందనలు తెలిపారు.

చిత్రం.. కిదాంబి శ్రీకాంత్