క్రీడాభూమి

ధోనీ చేతుల్లో పాక్ కెప్టెన్ కుమారుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 18: భారత్, పాకిస్తాన్‌ల మధ్య చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కారణంగా ఇరు దేశాల్లోను అభిమానులు వెర్రెక్కి పోతున్న తరుణంలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి చెందిన ఒక ఫోటో కోట్లాది మంది క్రికెట్ అభిమానుల ముఖాలపై చిరునవ్వులను తీసుకు వచ్చింది. ఆదివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఫోటోలో ధోనీ పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కుమారుడ్ని ఎత్తుకొని ఉన్నాడు. లండన్‌లోని ఓవల్ స్టేడియంలో ఇరు దేశాల మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కావడానికి కొద్ది గంటల ముందు ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వచ్చింది. ఈ ఫోటో ఇరు దేశాల్లను క్రికెట్ అనిమానుల మనసులను గెలుచుకొంది. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చడం ఇదే మొదటి సారి కాదు. గత ఏప్రిల్‌లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీదీ విరాట్ కోహ్లీ తన టీ షర్టును కానుకగా ఇచ్చినందుకు ఓ ట్వీట్‌లో కృతజ్ఞతలు చెప్పడం కూడా ఇలాగే ఇరుదేశాల క్రికెట్ అభిమానుల హృదయాలను దోచుకుంది.