క్రీడాభూమి

‘బ్రిక్స్’ దేశాల క్రీడల్లో భారత ఉషు జట్టు సత్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంగ్జూ (చైనా), జూన్ 19: చైనాలోని గాంగ్జూలో ‘బ్రిక్స్’ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల మధ్య జరుగుతున్న క్రీడా పోటీల్లో భారత ఉషు జట్టు ఆరు పతకాలతో సత్తా చాటుకుంది. వీటిలో రెండు పసిడి పతకాలు, రెండు రజత పతకాలు, మరో రెండు కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ పోటీల్లో భారత ఉషు క్రీడాకారులు తమకంటే ఎంతో అనుభవజ్ఞులైన చైనా, రష్యా క్రీడాకారులకు తీవ్రమైన పోటీ ఇవ్వడం గమనార్హం. ఆదివారం జరిగిన తైజికువాన్/తైజిజియాన్ ఈవెంట్‌లో భారత్‌కు ఎం.జ్ఞాన్‌దాస్ పసిడి పతకాన్ని అందించగా, ఎం.బిధేశ్వరీ దేవి రజత పతకాన్ని, ఎల్.సనత్‌గోంభి చానూ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఈ పోటీల్లో చివరి రోజైన సోమవారం భారత్ మరో మూడు పతకాలను తన ఖాతాలో వేసుకుంది. వీటిలో ఒక పసిడి పతకం, రజత పతకం, మరో కాంస్య పతకం ఉన్నాయి. చాంగ్‌కున్ ఓవరాల్ ఈవెంట్‌లో అంజుల్ నమ్‌దేవ్ పసిడి పతకాన్ని కైవసం చేసుకోగా, మహిళల చాంగ్‌కున్ ఈవెంట్‌లో తోషిబాల రజత పతకాన్ని, నన్‌కున్ ఆల్‌రౌండ్ ఈవెంట్‌లో సజన్ లామా కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.
బాస్కెట్‌బాల్ జట్టుకు చుక్కెదురు
అయితే ఈ పోటీల్లో భారత బాస్కెట్‌బాల్ జట్టుకు ఆదిలోనే చుక్కెదురైంది. ఆతిథ్య చైనాతో తొలి రోజు జరిగిన పోటీలో స్టార్ ఆటగాడు ఆమ్‌జ్యోత్ సింగ్ గిల్ చక్కగా రాణించినప్పటికీ భారత జట్టు 57-97 పాయింట్ల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ ప్రారంభంలోనే 9-0 తేడాతో భారత్‌పై పైచేయి సాధించిన చైనా జట్టు ప్రథమార్థం ముగిసే సమయానికి 38-28 ఆధిక్యత సాధించింది. ద్వితీయార్థంలోనూ అదే జోరు కొనసాగించిన థర్డ్ క్వార్టర్‌లో 33 పాయింట్లు, ఫోర్త్ క్వార్టర్‌లో మరో 26 పాయింట్లు రాబట్టుకుని మొత్తం మీద 40 పాయింట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది.