క్రీడాభూమి

గంభీర్‌పై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 19: టీమిండియా వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌పై వేటు పడింది. ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీ రంజీ క్రికెట్ జట్టు కోచ్ కెపి.్భస్కర్‌తో ఘర్షణకు దిగినందుకు శనివారం గంభీర్‌పై నిషేధం విధించి నాలుగు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల నుంచి సస్పెండ్ చేశారు. భాస్కర్-గంభీర్ మధ్య జరిగిన ఘర్షణపై మదన్‌లాల్, రాజేంద్ర ఆర్.రాథోర్, ప్రముఖ న్యాయవాది సోనీ సింగ్‌లతో డిడిసిఎ (్ఢల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్) అడ్మినిస్ట్రేటర్ జస్టిస్ విక్రమ్‌జీత్ సేన్ ఏర్పాటు చేసిన కమిటీ దర్యాప్తు జరిపి గంభీర్‌ను దోషిగా తేల్చింది. అంతేగాకుండా గంభీర్ ప్రవర్తన అసముచితంగానూ, తీవ్రమైనదిగానూ ఉందని పేర్కొంది. అయితే ఈ వ్యవహారంలో గంభీర్ తన నేరాన్ని అంగీకరించడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడబోనని హామీ ఇస్తే అతనికి విధించిన శిక్షను 2019 మార్చి 30వ తేదీ వరకు సస్పెండ్ చేయాలని జస్టిస్ విక్రమ్‌జీత్ సేన్ నిర్ణయించారు.