క్రీడాభూమి

నెదర్లాండ్స్ చేతిలో ఓడిన భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 20: హాకీ వరల్డ్ లీగ్ (డబ్ల్యుహెచ్‌ఎల్) సెమీ ఫైనల్ టోర్నమెంట్‌లో భారత జైత్రయాత్రకు అడ్డుకట్ట పడింది. ఈ టోర్నీలో వరుసగా స్కాట్లాండ్, కెనడా, పాకిస్తాన్ జట్లను చిత్తుచేసి ‘హ్యాట్రిక్’ సాధించిన భారత జట్టు మంగళవారం ఇక్కడ ర్యాంకింగ్స్‌లో ఉన్నత స్థానంలో ఉన్న నెదర్లాడ్స్ జట్టు చేతిలో 1-3 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది. ఈ టోర్నీలో భారత్‌కు ఇదే తొలి ఓటమి. ఈ మ్యాచ్‌లో అన్ని గోల్స్ ప్రథమార్థంలోనే నమోదవడం విశేషం. మ్యాచ్ ప్రారంభమైన 2వ నిమిషంలోనే నెదర్లాండ్స్‌కు థియెర్రీ బ్రింక్‌మన్ తొలి గోల్‌ను సాధించిపెట్టగా, 12వ నిమిషంలో శాండర్ బార్ట్, 24వ నిమిషంలో మిర్కో ప్రైజర్ చెరో గోల్‌ను అందించారు. ఆ తర్వాత భారత్‌కు ఆకాష్‌దీప్ సింగ్ అద్భుతమైన ఫీల్డ్ గోల్‌ను సాధించి పెట్టడంతో ప్రథమార్థం ముగిసే సమయానికి నెదర్లాండ్స్ 3-1 ఆధిక్యతలో నిలిచింది. ద్వితీయార్థంలో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా సాధించలేకపోవడంతో నెదర్లాండ్స్ విజయం సాధించింది. గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు మలేషియాతో తలపడనుండగా, అదే రోజు జరిగే మరో క్వార్టర్ ఫైనల్‌లో నెదర్లాండ్స్ పూల్-ఏ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన చైనాతో తలపడనుంది.

చిత్రం.. భారత్‌కు ఏకైక గోల్ అందించిన ఆకాష్‌దీప్ సింగ్