క్రీడాభూమి

చాంపియన్స్ ట్రోఫీ ఇక లేనట్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 20: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ ఇకమీదట జరగదా? భారత్ వేదికగా 2021లో జరగాల్సిన ఈ టోర్నీ తదుపరి ఎడిషన్‌ను రద్దు చేసి, ఈ నాలుగేళ్ల వ్యవధిలో రెండు సార్లు ప్రపంచ కప్ ట్వంటీ-20 చాంపియన్‌షిప్స్‌ను నిర్వహించాలనుకుంటున్నామని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) సిఇఓ డేవిడ్ రిచర్డ్‌సన్ వెల్లడించాడు. 2021లో జరిగే తదుపరి చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు ఆతిథ్య హక్కులను పొందిన భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆదివారం లండన్‌లోని ఓవల్ మైదానంలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో 180 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన విషయం విదితమే. చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్‌కు గల ప్రాముఖ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నప్పటికీ కొద్ది రోజుల క్రితం ఇంగ్లాండ్‌లో ముగిసిన ఈ ఈవెంట్‌ను ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు వీక్షించారు. అయినప్పటికీ నాలుగేళ్ల తర్వాత భారత్‌లో జరగాల్సిన తదుపరి ఎడిషన్ చాంపియన్స్ ట్రోఫీ టోర్నీని రద్దు చేయబోతున్నామని, ఆ తర్వాత కూడా ఈ టోర్నీ జరుగుతుందన్న గ్యారంటీ లేదని, ప్రస్తుతం ఓవల్‌లో జరుగుతున్న ఐసిసి వార్షిక సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని రిచర్డ్‌సన్ స్పష్టం చేశారు.