క్రీడాభూమి

అనిల్ కుంబ్లే ఔట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 20: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే గుడ్‌బై చెప్పాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి, కుంబ్లేకి మధ్య నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరాయన్న వదంతుల నడుమ అతను కోచ్ పదవి నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ధ్రువీకరించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) ఉన్నతాధికారులెవరూ అందుబాటులో లేరు. ఐసిసి (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు ప్రస్తుతం వారంతా లండన్‌లో ఉన్నారు. అయినప్పటికీ కోచ్ పదవికి కుంబ్లే రాజీనామా చేశాడన్న వార్తలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆదివారం లండన్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత జట్టు ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న రెండు రోజులకే కుంబ్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ పూర్తయిన తర్వాత టీమిండియా కోచ్‌గా కుంబ్లే కాంట్రాక్టు ముగిసింది. అయినప్పటికీ శుక్రవారం నుంచి వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో ఆడబోతున్న భారత జట్టు వెంట కరీబియన్ దీవులకు వెళ్లాల్సిందిగా కుంబ్లేకి అవకాశాన్ని కల్పించారు. అయితే ఐసిసి క్రికెట్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కుంబ్లే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు లండన్‌లోనే ఉండిపోవాలని నిశ్చయించుకోగా, భారత జట్టు మాత్రం లండన్ నుంచి బార్బడోస్‌కు బయలుదేరి వెళ్లింది.
టీమిండియా ప్రధాన కోచ్ పదవికి తాజాగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ ప్రారంభం కావడానికి ముందే బిసిసిఐ పత్రికా ప్రకటనలో స్పష్టం చేసిన విషయం విదితమే. కోచ్ ఎంపిక ప్రక్రియలో కుంబ్లేకి నేరుగా ప్రవేశం లభించగా, భారత జట్టు ఓపెనర్ వీరేంద్ర సెవాగ్, టామ్ మూడీ, రిచర్డ్ పైబస్, దొడ్డ గణేశ్, లాల్‌చంద్ రాజ్‌పుట్ తదితరులు కొత్తగా ఈ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు.
టీమిండియా మాజీ కెప్టెన్లు సచిన్ తెండూల్కర్, సౌరవ్ గంగూలీ, మాజీ ఓపెనర్ వివిఎస్.లక్ష్మణ్‌తో కూడిన బిసిసిఐ క్రికెట్ సలహా కమిటీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ సందర్భంగా బ్రిటన్‌లో అటు కుంబ్లేతోనూ, ఇటు కోహ్లీతోనూ సమావేశమై వారి మధ్య విభేదాలను పరిష్కరించేందుకు ప్రయత్నించింది. అయితే కుంబ్లేతో తనకు ఏమాత్రం పొసగడం లేదని, అతనితో సంబంధం చివరి దశకు చేరుకుందని కోహ్లీ ఈ సమావేశంలో స్పష్టం చేసినట్లు బిసిసిఐ వర్గాలు చెబుతున్నాయి.