క్రీడాభూమి

కుంబ్లే గొప్ప క్రికెటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్, జూన్ 22: అత్యుత్తమ క్రికెటర్‌గా అనిల్ కుంబ్లేను గౌరవిస్తానని, అతను దేశానికి చేసిన సేవలను ఎప్పటికీ గుర్తుంటాయని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. అయితే, కోచ్‌గా కుంబ్లే సాధించిన విజయాలను అతను ప్రస్తావించలేదు. వెస్టిండీస్‌తో శుక్రవారం మొదటి వనే్డ జరగనున్న నేపథ్యంలో అతను గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తనపై కుంబ్లే చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించాడు. కుంబ్లే గొప్ప క్రీడాకారుడనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నాడు. ఇద్దరి మధ్య ఎందుకు చెడిందని విలేఖరులు పదేపదే ప్రశ్నించినప్పటికీ కోహ్లీ సమాధానం చెప్పలేదు. డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన సంఘటనలను వెల్లడించడం సమంజసం కాదని, అసలు అలాంటి అలవాటు తనకు లేదని అన్నాడు. మరో ప్రశ్నపై స్పందిస్తూ, ఐదు వనే్డల్లోనూ రహానే ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడని అన్నాడు.

చిత్రం.. విరాట్ కోహ్లీ