క్రీడాభూమి

బర్న్స్, స్మిత్ శతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైస్ట్‌చర్చి: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండవ, చివరి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగుతున్నది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్, జో బర్న్స్ శతకాలతో రాణించడంతో, మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్లకు 363 పరుగులు చేసింది. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 370 పరుగులు చేయగా, ఏడు పరుగులు వెనుకంజలో ఉన్న ఆసీస్ చేతిలో ఇంకా ఆరు వికెట్లు ఉన్నాయి. ఒక వికెట్‌ను కోల్పోయి 57 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం ఉదయం ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా తొలుత ఉస్మాన్ ఖాజా (24) వికెట్‌ను కోల్పోయింది. ఆతర్వాత బర్న్స్, స్మిత్ ఆసీస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. కివీస్ బౌలర్లపై విరుచుకుపడి, మైదానం నలువైపులా షాట్లు కొట్టారు. మూడో వికెట్‌కు 289 పరుగులు జోడించిన తర్వాత బర్న్స్ అవుటయ్యాడు. వాగ్నర్ బౌలింగ్‌లో గుప్టిల్ క్యాచ్ పట్టగా అవుటైన అతను 170 పరుగులు సాధించాడు. 321 బంతులు ఎదుర్కొన్న అతని స్కోరులో 20 ఫోర్లు ఉన్నాయి. కాగా, మరో పరుగు తర్వాత స్మిత్ కూడా అదే రీతిలో పెవిలియన్ చేరాడు. 241 బంతులు ఎదుర్కొన్న స్మిత్ 17 ఫోర్ల సాయంతో 138 పరుగులు సాధించాడు. ఆట ముగిసే సమయానికి క్రిస్ వోగ్స్ (2), నైట్‌వాచ్‌మన్ నాథన్ లియాన్ (4) క్రీజ్‌లో ఉన్నారు.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 65.4 ఓవర్లలో ఆలౌట్ 370 (బ్రెండన్ మెక్‌కలమ్ 145, కోరీ ఆండర్సన్ 72, వాట్లింగ్ 58, నాథన్ లియాన్ 3/61).
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ (ఓవర్ నైట్ స్కోరు వికెట్ నష్టానికి 57): 110 ఓవర్లలో 4 వికెట్లకు 363 (జో బర్న్స్ 170, స్టీవెన్ స్మిత్ 138, నీల్ వాగ్నర్ 2/63, ట్రెంట్ బౌల్ట్ 2/85).