క్రీడాభూమి

కోహ్లీ బృందానికి నల్లేరుపై నడకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్, జూన్ 22: ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఢీకొని, పరాజయాన్ని చవిచూసినప్పటికీ, వెస్టిండీస్‌పై టీమిండియా పేవరిట్ ముద్రతోనే బరిలోకి దిగుతున్నది. ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగే మొదటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశే్లషకులు స్పష్టం చేస్తున్నారు. జాసన్ హోల్డన్ కెప్టెన్‌గా ఉన్న విండీస్ జట్టులో చాలా మంది సీనియర్లు లేరు. ఒక రకంగా దీనిని ద్వితీయ శ్రేణి జట్టుగా పేర్కోవాలి. అఫ్గానిస్తాన్ వంటి ‘పసికూన’ జట్టుతో తలపడి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను అతి కష్టం మీద 1-1గా డ్రా చేసుకోవడంలోనే విండీస్ బలహీనతలు స్పష్టమవుతున్నాయి. అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న టీమిండియాకు హోల్డర్ సేనను ఓడించడం నల్లేరుపై నడకగానే పేర్కోవాలి. సిరీస్‌ను గెల్చుకోవడం ఖాయంగా కనిపిస్తుండగా, ప్రత్యర్థికి 5-0 తేడాతో వైట్‌వాష్ వేయడమే భారత జట్టు లక్ష్యంగా ఎంచుకుంది. ఈ సిరీస్ తర్వాత ఒక టి-20 ఇంటర్నేషనల్‌ను కూడా టీమిండియా ఆడుతుంది.
ఎన్నో లాభాలు!
ఈ సిరీస్‌వల్ల భారత్‌కు, ప్రత్యేకించి కెప్టెన్ కోహ్లీకి ఎన్నో లాభాలున్నాయి. కోచ్ అనిల్ కుంబ్లేతో విభేదించి, చివరికి అతని ఉద్వాసనకు కారకుడయ్యాడన్న విమర్శలను ఎదుర్కొంటున్న కోహ్లీ, వాటి నుంచి తప్పించుకోవడానికి విండీస్ ఈ టూర్ ఉపయోగపడుతుంది. అంతంత మాత్రంగానే ఉన్న హోల్డర్ బృందంపై పూర్తి ఆధిపత్యాన్ని కనబరచి, సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే, సహజంగానే కోహ్లీ కెప్టెన్సీని ప్రతి ఒక్కరూ కీర్తిస్తారు. చాంపియన్స్ ట్రోఫీ పరాభవాన్ని మరచిపోయి ఆకాశానికి ఎత్తేస్తారు. అతనికి కావాల్సింది కూడా అదే. కోచ్ లేకపోయినప్పటికీ, జట్టును విజయపథంలో నడిపించే సత్తా తనకు ఉందని నిరూపించుకోవడానికి కూడా ఇదే సరైన తరుణం. నిరుడు విండీస్ టూర్‌తోనే టీమిండియా కోచ్‌గా కుంబ్లే అరంగేట్రం చేశాడు. ఏడాది తర్వాత అదే విండీస్ టూర్‌కు కోచ్ లేకుండానే టీమిండియా చేరుకుంది. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్, ఫీల్డింగ్ కోచ్ శ్రీ్ధర్ ఇంత వరకూ సీనియర్ ఆటగాళ్లకు గొప్పగా మార్గదర్శకం చేసిన సందర్భాలు లేవు. వారి నిర్ణయాలను కాదనేటంత ధైర్యం కూడా వీరికి లేదు. కాబట్టి, సపోర్టింగ్ స్ట్ఫా ఉన్నప్పటికీ, ఆజమాయిషీ చేసే వారు టీమిండియాకు లేరనే చెప్పాలి. ఇది కూడా కోహ్లీకి ఉపయోగపడే అంశమే. కెప్టెన్ హోదాలో అతను స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. పలురకాలైన ప్రయోగాలు చేయడానికి వీలుంటుంది. ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో మహమ్మద్ షమీ ఫిట్నెస్‌ను పరీక్షించడానికి విండీస్ టూర్‌ను మించిన మంచి సమయం లేదు. చాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన జట్టులో చోటు సంపాదించినప్పటికీ, ఒక్క మ్యాచ్‌ని ఆడే అవకాశం కూడా షమీకి రాలేదు. పలు మార్లు శస్తచ్రికిత్సలు చేయించుకున్న కారణంగా, 2015 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ తర్వాత అతను ఎక్కువ మ్యాచ్‌ల్లో ఆడలేకపోయాడు. ఒకటిరెండు టెస్టులు, దేశవాళీ మ్యాచ్‌ల్లో తప్ప అతను ఎక్కడా కనిపించలేదు. షమీ ఫిట్నెస్‌పై ఈ సిరీస్‌లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో, అతని స్థానాన్ని అజింక్య రహానేతో భర్తీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. నిజానికి రహానేను కోహ్లీ ఎన్నడూ వనే్డ బ్యాట్స్‌మన్‌గా పరిగణించలేదు. టెస్టు క్రికెట్‌కు మాత్రమే పనికి వస్తాడంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించాడు. అయితే, రోహిత్ లేకపోవడంతో, రహానేను ఓపెనర్‌గా దించాల్సిన పరిస్థితి ఉంది. ఈ ప్రయోగం భవిష్యత్తులో కోహ్లీకి బాగా ఉపయోగపడుతుంది.
హార్డ్ హిట్టర్‌గా పేరు సంపాదించిన యువ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌ను కూడా ఓపెనర్‌గా దించడం ద్వారా కోహ్లీ మరో ప్రయోగం చేయవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మొదటి పవర్ ప్లేలో, ఇన్‌సైడ్ సర్కిల్‌లో కేవలం ఇద్దరు ఫీల్డిర్లు ఉంటారు కాబట్టి, భారీగా పరుగులు రాబట్టడానికి పంత్‌ను బరిలోకి దించాలన్న వాదనతో కోహ్లీ ఏకీభవిస్తాడో లేదో చూడాలి. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇంకా ఎంత కాలం అంతర్జాతీయ క్రికెట్‌ను కొనసాగిస్తాడో తెలియదు కాబట్టి, ఇప్పటి నుంచే అతనికి ప్రత్యామ్నాయంగా పంత్‌ను తీర్చిదిద్దాలన్న ఆలోచన కోహ్లీకి లేకపోలేదు. విండీస్ టూర్‌లో ఈ ప్రయోగం కూడా ఖాయంగానే కనిపిస్తున్నది. ‘చైనామన్’గా పేరు సంపాదించిన యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ సామర్థ్యాన్ని పరీక్షించే వీలుంది. ఇటీవల అఫ్గానిస్తాన్‌తో జరిగిన వనే్డ సిరీస్‌లో, ఆ జట్టు స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను విండీస్ బ్యాట్స్‌మెన్ సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. ఈ కోణంలో చూస్తే, కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తప్పక తీసుకోవాలి. పైగా, ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో అశ్విన్, రవీంద్ర జడేజా విఫలమయ్యారు. వారిపై ఇంకా ఎక్కువ కాలం ఆధారపడకుండా, యువకుడైన కుల్దీప్ యాదవ్‌ను కోహ్లీ ప్రోత్సహిస్తాడనే వాదన వినిపిస్తున్నది. మొత్తం మీద, రాబోయే టోర్నీలు, సిరీస్‌లను దృష్టిలో ఉంచుకొని, కొన్ని కీలక ప్రయోగాలు చేసేందుకు విండీస్ టూర్‌ను మించిన అవకాశం కోహ్లీకి లభించదు. దీనిని అతను ఎంత వరకూ సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఉన్న తేడాను, బలాబలాలను బేరీజు వేసుకోవడానికి ఆటగాళ్ల అంతర్జాతీయ అనుభవాన్ని కొలమానంగా తీసుకోవచ్చు. విండీస్ జట్టుకు ఎంపికైన ఆటగాళ్లంతా కలిసి ఆడిన వనే్డ ఇంటర్నేషనల్స్ 213 మాత్రమే. కెప్టెన్ హోల్డర్ అత్యధికంగా 58 మ్యాచ్‌లు ఆడాడు. టీమిండియాలో యువరాజ్ సింగ్, ధోనీ అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల్లో పాల్గొనడం విశేషం. యువీ ఇంత వరకు 301 వనే్డలు ఆడితే, ధోనీ 291 మ్యాచ్‌లు ఆడాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీకి 184 వనే్డల అనుభవం ఉంది. ఈ ముగ్గురు ఆటగాళ్లు కలిపి ఆడిన మ్యాచ్‌ల సంఖ్య 776. ఇరు జట్ల మధ్య ఎంత వ్యత్యాసం ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ.
(్భరత కాలమానం ప్రకారం మ్యాచ్ శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు మొదలవుతుంది).