క్రీడాభూమి

తొలి వనే్డకు వర్షం బెడద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్, జూన్ 23: వెస్టిండీస్‌తో శుక్రవారం మొదలైన మొదటి వనే్డలో ఆటకు వర్షం వల్ల ఆటంకం ఏర్పడింది. టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 38 ఓవర్లలో మూడు వికెట్లకు 189 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం కురవడంతో ఆటను నిలిపేశారు. శిఖర్ ధావన్ 87, అజింక్య రహానే 62 పరుగులు చేయగా, యువరాజ్ సింగ్ నాలుగు పరుగులకే వెనుదిరిగాడు. మొదటిసారి ఆటను నిలిపేసే సమయానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ 30, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అనంతరం ఆట కొనసాగినప్పటికీ, మరో ఎనిమిది బంతుల తర్వాత తిరిగి వర్షం కారణంగా ఆగిపోయంది. కోహ్లీ 32, ధోనీ 9 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. జాసన్ హోల్డర్ 34 పరుగులకు ఒకటి, దేవేంద్ర బిషూ 31 పరుగులకు ఒకటి చొప్పున వికెట్లు పడగొట్టారు.