క్రీడాభూమి

పోటీపడిన జట్లు ఇవే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 23: ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో ఇంత వరకూ మూడు నామమాత్రపు జట్లు సహా మొత్తం 14 జట్లు తలపడ్డాయి. మొదటి వరల్డ్ కప్‌లో టెస్టు హోదావున్న దేశాల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉండడంతో, జమైకా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, యంగ్ ఇంగ్లాండ్ జట్లకు పోటీపడే అవకాశం కల్పించారు. ఆస్ట్రేలియా, డెన్మార్క్, ఇంగ్లాండ్, భారత్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ ఈ టోర్నీలో ఆడిన క్రియాశీలక జట్లు. ఈసారి టోర్నీకి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు అర్హత సంపాదించాయి.
* భారత్ 1973, 1988 సంవత్సరాల్లో ప్రపంచ కప్‌లో పాల్గోలేదు. 2005లో ఫైనల్ చేరినప్పటికీ టైటిల్ గెల్చుకోలేక, రన్నరప్ స్థానంతో సంతృప్తి చెందింది. 2009లో మూడో స్థానం సంపాదించింది. రెండు సార్లు సెపీ ఫైనల్స్ వరకూ చేరింది. మూడు పర్యాయాలు నాలుగో స్థానానికి పరిమితమైంది. 2013 వరల్డ్ కప్‌లో దారుణంగా విఫలమై, ఏడో స్థానానికి పడిపోయింది.
* భారత జట్టు మొట్టమొదటి గుర్తింపు పొందిన మ్యాచ్ 1976లో వెస్టిండీస్‌పై ఆడింది. అంతకు ముందు, 1973లో భారత మహిళల క్రికెట్ బోర్డును నెలకొల్పారు. ఇటీవలే దీనిని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)లో విలీనం చేశారు. దేశవాళీ క్రికెట్‌లో ఝాన్సీ రాణి కప్ పేరుతో ఒక టోర్నీని నిర్వహిస్తున్నారు. రంజీ ట్రోఫీ మాదిరి ఈ టోర్నీ కూడా మంచి పేరు తెచ్చుకుంది. కాగా, భారత మహిళల జట్టు విదేశాల్లో మొదటి టెస్టు విజయాన్ని దక్షిణాఫ్రికాపై 2002లో నమోదు చేసింది.
* భారత మహిళల జట్టు 2004లో తొలిసారి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. ఆతర్వాత మరో మూడు పర్యాయాలు ఇదే టోర్నీలో విజేతగా నిలిచి సత్తా చాటుకుంది. అయతే, వరల్డ్ కప్ ఇంకా భారత్‌కు అందని ద్రాక్షగానే మిగిలింది.