క్రీడాభూమి

భారత్ తొలి ప్రత్యర్థి ఇంగ్లాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెర్బీ, జూన్ 23: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఆధ్వర్యంలో మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ శనివారం నుంచి మొదలుకానుంది. మిథాలీ రాజ్ నాయకత్వం వహిస్తున్న భారత్ మొదటి రోజు గ్రూప్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఢీ కొంటుంది. ప్రతిభావంతులు ఉన్నప్పటికీ, నిలకడగా ఆడలేరన్న ముద్ర వేయించుకున్న మిథాలీ సేన ఈ మ్యాచ్‌లో గట్టెక్కడానికి చాలా కష్టపడాలి. 2005లో రన్నరప్‌గా నిలవడమే వరల్డ్ కప్‌లో భారత్‌కు అత్యుత్తమ ప్రదర్శన. ఈ మెగా టోర్నీకి ఈసారి భారత్ నేరుగా అర్హత సంపాదించి ఉండేది. కానీ, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు నిరాకరించిన కారణంగా అత్యంత కీలకమైన పాయింట్లు కోల్పోయింది. ఆ మూడు మ్యాచ్‌ల్లోనూ నిర్వాహకులు పాక్‌ను విజేతగా ప్రకటించారు. దీనితో శ్రీలంకలో జరిగిన క్వాలిఫయర్స్‌లో పోటీపడాల్సి వచ్చింది. అందులో మిథాలీ బృందం అద్భుతంగా రాణించింది. గ్రూప్, నాకౌట్ దశల్లో అన్ని మ్యాచ్‌లనూ గెలిచింది. హోరాహోరీగా సాగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఒక వికెట్ తేడాతో ఓడించి, మెయిన్ డ్రాకు అర్హత సంపాదించింది. గ్రూప్ దశను విజయవంతంగా అధిమించి, సెమీ ఫైనల్ చేరడమే తమ ప్రథమ లక్ష్యమని మిథాలీ ఇప్పటికే ప్రకటించింది. ఆమె ఆలోచన కూడా సరైనదే. ఒక్కో అడుగు ముందుస్తూ, లక్ష్యాన్ని చేరుకోవాలన్న వ్యూహం మంచిదే. ఇటీవల జరిగిన నాలుగు దేశాల క్రికెట్ టోర్నమెంట్‌లో చక్కగా రాణించడంతో భారత క్రీడాకారిణుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. అయినప్పటికీ, ఫైనల్ చేరతామని, టైటిల్ సాధిస్తామని గొప్పలు చెప్పకుండా, సెమీ ఫైనల్స్ తమ మొదటి లక్ష్యమని పేర్కోవడం ద్వారా మిథాలీ విజ్ఞతను ప్రదర్శించింది. నాలుగు దేశాల టోర్నీలో దీప్తి శర్మ, పూనమ్ రావత్ మొదటి వికెట్‌కు 320 పరుగులు జోడించి ప్రపంచ రికార్డు సృష్టించారు. మహిళల క్రికెట్‌లో మూడు వందలకుపైగా పరుగుల భాగస్వామ్యం నమోదు కావడం అదే మొదటిసారి. వీరితోపాటు కెప్టెన్ మిథాలీ, స్మృతి మందానా, మోనా మెష్రామ్ భారత బ్యాటింగ్ బలాన్ని పెంచుతున్నారు. హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా బ్యాటింగ్‌లో రాణించగల సమర్థురాలే. అయితే, వీరిలో ఎక్కువ మందికి ఇంగ్లాండ్ వాతావరణంలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన అనుభవం లేదు. పిచ్ తీరును తమకు అనువుగా మలచుకుంటే, శనివారం నాటి మ్యాచ్‌లో మిథాలీ బృందం ఇంగ్లాండ్‌కు గట్టిపోటీనివ్వడం ఖాయం. బౌలింగ్‌లోనూ భారత్ బలంగానే ఉంది. మహిళల వనే్డ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పిన ఝూలన్ గోస్వామి ఈ సిరీస్‌లోనూ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు సిద్ధంగా ఉంది. ఎక్తా బిస్త్ స్పిన్ విభాగంలో కీలక పాత్రను పోషించనుంది. కాగితంపై చూస్తే, హీతర్ నైట్ నాయకత్వంలోని ఇంగ్లాండ్‌కు భారత జట్టు ఏమాత్రం తీసిపోదు. అయితే, స్వదేశంలో మ్యాచ్ ఆడుతున్నందున 3హోం ఆడ్వాంటేజ్2 ఇంగ్లాండ్‌కు ఉంటుంది. గతంలో రెండు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చింది. రెండు సార్లు విజేతగా నిలిచింది. ఈసారి కూడా అదే ఫలితాన్ని రాబట్టే ప్రయత్నం చేయనుంది. సారా టేలర్, కాథెరిన్ బ్రంట్, నాట్ షివర్ వంటి అనుభవజ్ఞులు ఉన్న ఇంగ్లాండ్‌ను ఓడించడానికి భారత్ తీవ్రంగా పోరాడక తప్పదు.
*
భారత కాలమానం ప్రకారం మ్యాచ్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలవుతుంది.
*
షెడ్యూల్ ఇదే
భారత్/ ఇంగ్లాండ్ (డెర్బీ), న్యూజిలాండ్/ శ్రీలంక (బ్రిస్టల్), జూన్ 25: పాకిస్తాన్/ దక్షిణాఫ్రికా (లీసెస్టర్), జూన్ 26: ఆస్ట్రేలియా/ వెస్టిండీస్ (టౌన్టన్), జూన్ 27: ఇంగ్లాండ్/ పాకిస్తాన్ (లీసెస్టర్), జూన్ 28: దక్షిణాఫ్రికా/ న్యూజిలాండ్ (డెర్బీ), జూన్ 29: శ్రీలంక/ ఆస్ట్రేలియా (బ్రిస్టల్), జూన్ 29: వెస్టిండీస్/ భారత్ (టౌన్టన్), జూలై 2: ఆస్ట్రేలియా/ న్యూజిలాండ్ (బ్రిస్టల్), జూలై 2: భారత్/ పాకిస్తాన్ (డెర్బీ), దక్షిణాఫ్రికా/ వెస్టిండీస్ (లీసెస్టర్), ఇంగ్లాండ్/ శ్రీలంక (టౌన్టన్), జూలై 5: శ్రీలంక/ భారత్ (డెర్బీ), పాకిస్తాన్/ ఆస్ట్రేలియా (లీసెస్టర్), జూలై 6: న్యూజిలాండ్/ వెస్టిండీస్ (టౌన్టన్), జూలై 8: దక్షిణాఫ్రికా/ భారత్ (లీసెస్టర్), న్యూజిలాండ్/ పాకిస్తాన్ (టౌన్టన్), జూలై 9: ఇంగ్లాండ్/ ఆస్ట్రేలియా (బ్రిస్టల్), వెస్టిండీస్/ శ్రీలంక (డెర్బీ), జూలై 11: వెస్టిండీస్/ పాకిస్తాన్ (లీసెస్టర్), జూలై 12: ఆస్ట్రేలియా/ భారత్ (బ్రిస్టల్), ఇంగ్లాండ్/ న్యూజిలాండ్ (డెర్బీ), శ్రీలంక/ దక్షిణాఫ్రికా (టౌన్టన్), జూలై 15: ఇంగ్లాండ్/ వెస్టిండీస్ (బ్రిస్టల్), భారత్/ న్యూజిలాండ్ (డెర్బీ), పాకిస్తాన్/ శ్రీలంక (లీసెస్టర్), దక్షిణాఫ్రికా/ ఆస్ట్రేలియా (టౌన్టన్), జూలై 18: మొదటి సెమీ ఫైనల్ (బ్రిస్టల్), జూలై 20: రెండో సెమీ ఫైనల్ (డెర్బీ), జూలై 23: ఫైనల్ (లార్డ్స్).