క్రీడాభూమి

ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం మారదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: ఒకే ప్రశ్నను ఎన్నిసార్లు మార్చిమార్చి అడిగినా తన సమాధానంలో మార్పు ఉండదని రిటైర్మెంట్‌పై భారత పరిమిత ఓవర్ల జట్ల కె ప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశాడు. ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి వెళుతున్న సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ధోనీపై విలేఖరులు రిటైర్మెంట్ గురించి పదేపదే ప్రశ్నించడంతో అతను స్పందిస్తూ, ఎన్నిసార్లు అడిగినా తన సమాధానం ఒకటేనని వ్యాఖ్యానించాడు. ‘నెల లేదా 15 రోజుల క్రితం ఇదే ప్రశ్నకు నేను సమాధానమిచ్చాను. ఇంతలోనే నా సమాధానం మారిపోదు. మీరు ఎక్కడ, ఎప్పుడు, ఏ సందర్భంలో అడిగినా నా జవాబు ఒకేలా ఉంటుంది. రిటైర్మెంట్ గురించిన ఆలోచనలు ప్రస్తుతానికి లేవు. మరికొంత కాలం నేను కెరీర్‌ను కొనసాగిస్తాను. క్రికెట్ ఆడడం సంతృప్తినివ్వని మరుక్షణమే తగిన నిర్ణయం తీసుకుంటాను’ అన్నాడు. చాలా మంది విలేఖరులు ఎన్నో రకాలుగా రిటైర్మెంట్‌పైనే ప్రశ్నలు వేస్తుంటారని ధోనీ అన్నాడు. ప్రశ్నలు అడిగే హక్కు పాత్రికేయులకు ఉందని, అంతమాత్రం చేత ఏదంటే అది అడగడం భావ్యం కాదని అన్నాడు. ప్రశ్నలను ఎంచుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. రిటైర్మెంట్ గురించి ఆలోచించడం లేదని రెండు రోజుల క్రితమే చెప్పానని, మళ్లీ అదే ప్రశ్న వేయడంలో అర్థం ఉండదని వ్యాఖ్యానించాడు. విలేఖరుల సమావేశాన్ని ప్రశ్నలు వేయడానికే ఏర్పాటు చేస్తారని అంటూ, ఒకే ప్రశ్నను పదేపదే అడగానికి మాత్రం కాదని అన్నాడు. మరో ప్రశ్నపై స్పందిస్తూ, ప్రజలు ఎప్పుడూ ఏవో ప్రశ్నలు వేస్తునే ఉంటారని, వారిని ఆపడం ఎవరికీ సాధ్యం కాదని అన్నాడు. ఆసియా చాంపియన్‌షిప్ లేదా టి-20 వరల్డ్ కప్‌లో ముందుకు వెళ్లలేకపోతే, జట్టును చాలా తొందరపడి ఎంపిక చేశారా? అని అడుగుతారని, ఒకవేళ ఫైనల్‌లో ఓడితే ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోలేరా అన్న ప్రశ్న వస్తుందని వాపోయాడు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపడం కూడా సాధారణమని చెప్పాడు. తాము మాత్రం వీటిని పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి కేంద్రీకరిస్తామని ధోనీ స్పష్టం చేశాడు. జట్టు బలంగా ఉందని, అన్ని విభాగాల్లోనూ ఉత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తామన్న నమ్మకం తనకు ఉందని అన్నాడు.