క్రీడాభూమి

ఇది కూడా ఒక రికార్డే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టౌన్టన్, జూన్ 24: క్రికెట్‌లో గొప్పగొప్ప రికార్డులే కాదు... ఒక్కోసారి ఎవరూ కోరుకోని రికార్డులు కూడా నమోదవుతాయి. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జాసన్ రాయ్ పొరపాటు చేసి, అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్‌గా అవుటయ్యాడు. టి-20 ఫార్మాట్‌లో ఈ విధంగా అవుటైన తొలి క్రికెటర్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టి-20 మ్యాచ్‌లో జట్టును గెలిపించేందుకు చెమటోడ్చిన అతను అనూహ్యంగా అవుట్ కావడంతో, ఆతర్వాత కోలుకోలేకపోయిన ఇంగ్లాండ్ మూడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 174 పరుగులు చేసింది. ఎబి డివిలియర్స్ (45), జెజె స్మట్స్ (45) శ్రమ వల్ల ఈ స్కోరు సాధ్యమైంది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేయగలిగింది. జాసన్ రాయ్ 45 బంతులోవ్ల 67 పరుగులు చేసి, ఫీల్డర్‌ను ఉద్దేశపూర్వకంగా ఆడ్డుకున్నాడన్న కారణంగా అవుటయ్యాడు. అతను పెవిలియన్ చేరకపోతే, ఇంగ్లాండ్ విజయం సాధించి ఉండేది.