క్రీడాభూమి

ఎన్‌డిఎపై ఆర్‌సిఎ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, జూన్ 24: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)కు రూపకల్పన చేసి, దానిని ఒక గొప్ప ఈవెంట్‌గా తీర్చిదిద్దిన ఆ టోర్నీ మాజీ కమిషనర్ లలిత్ మోదీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అతను అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న నగర్ జిల్లా సంఘం (ఎన్‌డిఎ)పై రాజస్థాన్ క్రికెట్ సంఘం (ఆర్‌సిఎ) వేటు వేసింది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అప్పటి అధ్యక్షుడు శ్రీనివాసన్‌తో పలు అంశాల్లో తీవ్రంగా విభేదించిన లలిత్ మోదీ సస్పెన్షన్ వేటును ఎదుర్కొన్నాడు. లండన్‌లో స్థిర నివాసం ఉంటున్నప్పటికీ, శ్రీనివాసన్‌పై ఉన్న ఆగ్రహంతో అతను తన సస్పెన్షన్‌ను కోర్టులో సవాలు చేశాడు. ఆ రోజుల్లో, అతనికి ఆర్‌సిఎ అండగా నిలిచి, బిసిసిఐ ఆగ్రహానికి గురైంది. లలిత్ మోదీ పక్షాన నిలచినందుకు సస్పెన్షన్ వేటుకు గురైంది. ఇలావుంటే, బిసిసిఐలో భారీ మార్పులు చోటు చేసుకోవడం, కోర్టు తీర్పు లలిత్ మోదీకి అనుకూలంగా రావడం వంటి పరిణామాలు భారత క్రికెట్ రూపురేఖలనే మార్చివేసే పరిస్థితిని సృష్టించాడు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆర్‌సిఎపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసిన బిసిసిఐ ఇటీవలే ఎన్నికలు కూడా నిర్వహించింది. లలిత్ మోదీ కుమారుడు రుచిర్ మోదీ అధ్యక్ష పదవికి పోటీపడగా, అతనిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిపి జోషి విజయం సాధించాడు. అయితే, ఆర్‌సిఎ సభ్య సంఘమైన ఎన్‌డిఎకు లలిత్ మోదీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అప్పటి నుంచి ఎన్‌డిఎపై కక్షకట్టిన ఆర్‌సిఎ చివరికి ఆ సంఘాన్ని సస్పెండ్ చేసింది. సుమారు దశాబ్దకాలం కోర్టుల చుట్టూ తిరిగిన ఆర్‌సిఎ ఈ తాజా చర్యతో మళ్లీ కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి తలెత్తే ప్రమాదం లేకపోలేదు. ఒకవేళ ఎన్‌డిఎ కోర్టును ఆశ్రయస్తే, గతంలో మాదిరి ఆర్‌సి ఎ గుర్తింపును కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నా య. అయనప్పటికీ, లలిత్ మోదీపై ఉన్న కసితో ఆర్‌సిఎ అధ్యక్షుడు జోషి ఈ నిర్ణయం తీసుకున్నా డని అంటున్నారు.