క్రీడాభూమి

వరుణుడు కరుణిస్తాడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్, జూన్ 24: వెస్టిండీస్‌తో ఆదివారం రెండో వనే్డకు విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సిద్ధమైంది. మొదటి వనే్డ వర్షం కారణంగా రద్దయిన నేపథ్యంలో, రెండో మ్యాచ్ ఎలాంటి బెడద లేకుండా జరగాలని అటు క్రికెటర్లు, ఇటు అభిమానులు కోరుకుంటున్నారు. శుక్రవారం నాటి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 39.2 ఓవర్లలో 3 వికెట్లకు 199 పరుగులు సాధించింది. 38 ఓవర్లు ముగిసినప్పుడు మొదటిసారి ఆట నిలిచిపోగా, వర్షం తగ్గిన తర్వాత మళ్లీ మొదలైంది. కానీ, ఎనిమిది బంతులు బౌలైన అనంతరం మరోసారి భారీ వర్షం కురవడంతో ఆటను నిలిపివేశారు. ఎంతకూ పరిస్థితి అనుకూలించకపోవడంతో, మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇలావుంటే, ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైన భారత్ ఇప్పుడు జాసన్ హోల్డన్ కెప్టెన్‌గా ఉన్న వెస్టిండీస్‌ను చిత్తుచేయడం ద్వారా పరువు నిలబెట్టుకోవాలని అనుకుంటున్నది. మొదటి వనే్డను వర్షం వెంటాడగా, రెండో వనే్డ సాఫీగా జరగాలని కోరుకుంటున్నది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (87), అజింక్య రహానే (62) రాణించగా, యువరాజ్ సింగ్ కేవలం నాలుగు పరుగులకే అవుటయ్యాడు. రెండో మ్యాచ్‌లో అతను మళ్లీ ఫామ్‌లోకి వస్తాడని టీమిండియా ఆశిస్తున్నది.
భారత కాలమానం ప్రకారం మ్యాచ్ ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు మొదలవుతుంది.