క్రీడాభూమి

శ్రీలంక కోచ్ పదవికి ఫోర్డ్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, జూన్ 24: శ్రీలంక క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ పదవికి గ్రాహం ఫోర్డ్ రాజీనామా చేశాడు. 2019 ప్రపంచ కప్ ముగిసే వరకూ ఒప్పందం ఉన్నప్పటికీ, అతను హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో లంక సెమీ ఫైనల్ కూడా చేరలేకపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ అతను రాజీనామా చేసినట్టు సమాచారం. అయితే, కారణాలను శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి) తన ప్రకటనలో ప్రస్తావించలేదు. ఫోర్డ్ రాజీనామా చేశాడని, దానిని ఆమోదించామని మాత్రమే తెలిపింది. 2012 నుంచి 2014 వరకూ అతను రెండేళ్లపాటు లంక జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. తిరిగి నిరుడు ఫిబ్రవరిలో మరోసారి కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. కానీ, ఏడాదిన్నరలోపే ఒప్పందాన్ని వదులుకున్నాడు. ఒకానొకప్పుడు వరుస వైఫల్యాలతో అల్లాడుతూ, టెస్టు హోదాను కోల్పోయే ప్రమాదంలో పడిన లంకను మళ్లీ గాడిలో పెట్టిన ఘనత దక్షిణాఫ్రికాకు చెందిన ఫోర్డ్‌కే దక్కుతుంది. రెండోసారి కోచ్‌గా ఎంపికైన తర్వాత కూడా అతను ఉత్తమ సేవలు అందించాడు. అతని మార్గదర్శకంలోనే పటిష్టమైన ఆస్ట్రేలియాను ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో లంక చిత్తుచేసింది. ఆతర్వాత జింబాబ్వేను వనే్డ, టి-20 సిరీస్‌ల్లో ఓడించింది. అయితే, చాంపియన్స్ ట్రోఫీలో లంక విఫలం కావడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. అతను స్వచ్ఛందంగానే రాజీనామా చేశాడా లేక ఎస్‌ఎల్‌సి అధికారులు ఒత్తిడి చేసి రాజీనామా చేయించారా అన్న ప్రశ్నకు సమాధానం లభించాల్సి ఉంది.

చిత్రం.. గ్రాహం ఫోర్డ్