క్రీడాభూమి

భారత్ బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెర్బీ, జూన్ 24: మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భారత్ శుభారంభం చేసింది. హైదరాబాదీ మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత్ అన్ని విభాగాల్లోనూ సత్తా చూపి, ఇంగ్లాండ్‌ను 35 పరుగుల తేడాతో ఓడించింది. ఓపెనర్లు పూనమ్ రావత్, స్మృతి మందానాతోపాటు కెప్టెన్ మిథాలీ కూడా అర్ధ శతకాలతో రాణించడంతో, భారత్ 50 ఓవర్లలో మూడు వికెట్లకు 281 పరుగులు చేయగలిగింది. అనంతరం ప్రత్యర్థిని 47.3 ఓవర్లలో246 పరుగులకే కట్టడి చేసింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత ఇన్నింగ్స్‌కు పూనమ్, స్మృతి బలమైన పునాది వేశారు. వీరిద్దరూ ఇంగ్లాండ్ బౌలింగ్‌ను ఆచితూచి ఆడుతూ, మొదటి వికెట్‌కు 144 పరుగులు జోడించారు. 72 బంతులు ఎదుర్కొని, 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో 90 పరుగులు చేసిన స్మృతిని డానియేల్ హాజెల్ క్యాచ్ అందుకోగా కెప్టెన్ హీథర్ నైట్ అవుట్ చేసింది. స్మృతి పది పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయినప్పటికీ, భారత్ గౌరవ ప్రదమైన స్కోరును సాధించడంలో కీలక భూమిక పోషించింది. జట్టు స్కోరు 222 పరుగుల వద్ద పూనమ్ వికెట్ కూలింది. ఆమె 134 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 86 పరుగులు చేసి, హీథర్ నైట్ బౌలింగ్‌లో డానియేల్ వాట్‌కు చిక్కింది. అనంతరం మిథాలీ రాజ్ (73 బంతుల్లో 71), హర్మన్‌ప్రీత్ కౌర్ (22 బంతుల్లో 24) మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడి, 50 ఓవర్లలో జట్టు స్కోరును మూడు వికెట్లకు 281 పరుగులకు చేర్చారు. ఇంగ్లాండ్ బౌలర్లలో హీథర్ నైట్‌కు రెండు వికెట్లు లభించగా, డానియేల్ హాజెల్ ఒక వికెట్ సాధించింది. అనంతరం చివరి వరకూ పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. ఫ్రాన్ విల్సన్ ఒంటరి పోరాటం జరిపి, 75 బంతుల్లో 81 పరుగులు చేసి, దురదృష్టవశాత్తు రనౌటైంది. కెప్టెన్ హీథర్ నైట్ (46) కొంత వరకూ పోరాడినప్పటికీ, మిగతా బ్యాట్స్‌మన్ విఫలం కావడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కు మరో 15 బంతులు మిగిలి ఉండగాన, 246 పరుగుల వద్ద తెరపడింది. భారత టాప్ స్కోరర్ స్మృతి మందానాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్ ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 3 వికెట్లకు 281 (పూనమ్ రావత్ 86, స్మృతి మందానా 90, మిథాలీ రాజ్ 71 నాటౌట్, హీథర్ నైట్ 2/41, డానియేల్ హాజెల్ 1/51).
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: 47.3 ఓవర్లలో 246 ఆలౌట్ (హీథర్ నైట్ 46, ఫ్రాన్ విల్సన్ 81, దీప్తి శర్మ 3/27, శిఖా పాండే 2/35).

చిత్రాలు.. .. 90 పరుగులు చేసి, భారత్ ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేసిన
ఓపెనర్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ స్మృతి మందానా *కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన మిథాలీ రాజ్ (71 నాటౌట్)