క్రీడాభూమి

కన్నుల పండువగా మహిళల ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ ప్రారంభోత్సవ వేడుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ శనివారం ఇంగ్లాండ్‌లో అట్టహాసంగా మొదలైంది. మొదటి రోజున రెండు మ్యాచ్‌లు జరిగాయ. ఒక మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను భారత్ 35 పరుగుల తేడాతో ఓడించింది. మరో మ్యాచ్‌లో శ్రీలంకను న్యూజిలాండ్ తొమ్మిది వికెట్ల ఆధిక్యంతో చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన లంక 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయ 188 పరుగులు చేసింది. చామరి అటపట్టు 53, చామరి పొల్గాంపొలా 49 పరుగులు చేయగా, మిగతా వారు పరుగుల వేటలో విఫలమయ్యారు. కివీస్ బౌలర్ హోలీ హడెల్‌సన్ 35 పరుగులకు ఐదు వికెట్లు కూల్చింది. అనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 37.4 ఓవర్లలోనే విజయభేరి మోగించింది. రాచెల్ ప్రీస్ట్ రెండు పరుగులకే అవుట్‌కాగా, కెప్టెన్ సుజీ బేట్స్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి సెంచరీ సాధించింది. 108 బంతులు ఎదుర్కొన్న ఆమె 11 ఫోర్లు ఒక సిక్సర్‌తో 106 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. అమీ సాటెర్త్‌వైట్ 103 బంతుల్లో, ఏడు ఫోర్లతో 78 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచింది. వీరిద్దరి ప్రతిభ కివీస్‌కు తొమ్మిది వికెట్ల తేడాతో విజయాన్ని అందించింది.

చిత్రం.. లండన్‌లో శనివారం కన్నుల పండువగా జరిగిన మహిళల ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ ప్రారంభోత్సవ వేడుక