క్రీడాభూమి

ఢిల్లీ ఓపెన్ టెన్నిస్ ఫైనల్‌లో సాకేత్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఢిల్లీ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు సాకేత్ మైనేని రన్నరప్ ట్రోఫీతో సరిపుచ్చుకున్నాడు. ఫైనల్‌లో ఫ్రాన్స్‌కుచెందిన స్ట్ఫిన్ రాబర్ట్‌ను ఢీకొన్న అతను 3-6, 0-6 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. మొదటి సెట్‌లో సాకేత్ నుంచి కొద్దిపాటి ప్రతిఘటన ఎదురైనప్పటికీ దానిని సమర్థంగా అధిగమించిన రాబర్ట్ రెండో సెట్‌లో చెలరేగిపోయాడు. సాకేత్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆ సెట్‌ను సొంతం చేసుకొని టైటిల్ అందుకున్నాడు. పురుషుల డబుల్స్ ఫైనల్‌లో ఓడిన సాకేత్ సింగిల్స్‌లోనూ టైటిల్ సాధించలేకపోయాడు. డబుల్స్ విభాగంలో సనమ్ సింగ్‌తో కలిసి బరిలోకి దిగిన అతనిపై యుకీ భంబ్రీ, మహేష్ భూపతి జోడీ 6-3, 4-6, 10-5 తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా, మహిళల డబుల్స్‌లో సుచింగ్ వెన్, లీ యాసువాన్ జోడీ 6-0, 10-6 స్కోరుతో నటేలా జలామిజ్, వెరోనికా కుడెర్మెటోవా జోడీపై గెలిచి టైటిల్‌ను స్వీకరించింది. శనివారం జరిగిన మహిళ సింగిల్స్ ఫైనల్‌లో నినా స్టొజానొవిచ్‌ను 3-6, 6-2, 6-4 స్కోరుతో ఓడించిన సబినే షిరపోవా టైటిల్ అందుకున్న విషయం తెలిసిందే.